spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Roja Comments: జగన్ కు చేటు తెస్తున్న రోజా కామెంట్స్!

Roja Comments: జగన్ కు చేటు తెస్తున్న రోజా కామెంట్స్!

Roja Comments: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత, మాజీమంత్రి రోజా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు జరుపుకున్న తీరును ఆమె తప్పు పట్టారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి సమక్షంలోనే.. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడారు. భార్యలు లేకుండా ఇద్దరు నేతలు ఉగాది వేడుకలు ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. అయితే ఆమెకు తెలియకుండానే తెలుగుదేశం కూటమికి విమర్శలకు సంబంధించి ఆయుధం ఇచ్చారు. రోజా ఏం మాట్లాడకూడదు అదే మాటలు ఆమె నోటి నుంచి వచ్చేసరికి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దంపతులు కార్నర్ అవుతున్నారు.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

జగన్మోహన్ రెడ్డిని అనుసరించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు మంచి చేస్తారో? చెడ్డ చేస్తారో? అన్నది వారికి ఎరుక. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మత విశ్వాసాలు తెలియని వారు ఉండరు. బలవంతంగా ఆయనకు హిందూ ముద్ర వేయాలని చేసే ప్రయత్నాలు వికటిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అదే ప్రయత్నం చేశారు రోజా. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై చేసిన ఆ వ్యాఖ్యలు ఆ పార్టీకి చిక్కు తెచ్చి పెడుతున్నాయి. ఉగాది వేడుకను జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతి రెడ్డితో కలిసి చేసుకున్నారు. అలా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ చేయలేదన్నది రోజా అభిప్రాయం. ఒక పండుగ ఎలా జరుపుకోవాలి అనేది ఆ వ్యక్తి అభిప్రాయం. దానిని రోజా హైలెట్ చేసేసరికి టిడిపి కౌంటర్ ప్రారంభించింది. జగన్ గతంలో తిరుమల పర్యటన సమయంలో డిక్లరేషన్ ఇవ్వని తీరును.. బ్రహ్మోత్సవాల సమయంలో భార్య లేకుండానే పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భాలను సాక్షాలతో సహా సోషల్ మీడియా లో బయట పెడుతున్నారు.

సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. అది చాలా సందర్భాల్లో స్పష్టమైనది కూడా. అనవసరంగా అదే హిందుత్వవాదములు విషయంలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తే అవి తిరిగి తమకే గుచ్చుకుంటాయి అన్న విషయం వైసిపి నేతలు తెలుసుకోవాలి. అటువంటి వారిని జగన్ నిలువరించకపోతే రివర్స్ అవుతాయని ఆయన సైతం గ్రహించుకోవాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper