spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Reddy Community Political Influence In AP: ఏపీలో రెడ్డి సామాజిక వర్గం స్ట్రాంగ్ డెసిషన్?!

Reddy Community Political Influence In AP: ఏపీలో రెడ్డి సామాజిక వర్గం స్ట్రాంగ్ డెసిషన్?!

Reddy Community Political Influence In AP: రెడ్డి సామాజిక వర్గం తీవ్ర అంతర్మధనంతో ఉంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదన్న బాధ వెంటాడుతోంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది కానీ.. అగ్ర తాంబూలం లేదన్న ఆవేదన ఉంది. భారతీయ జనతా పార్టీ పై హిందుత్వవాద ముద్ర ఉంది. జనసేన పై కాపు సామాజిక వర్గ ప్రభావం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తే మాత్రం రెడ్డి సామాజిక వర్గం మద్దతు తీసుకొని ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది. పోనీ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉండం అంటే అక్కడ పరిస్థితి బాగాలేదు. అందుకే రెడ్డి సామాజిక వర్గం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సొంతంగానే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.

Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?

* కాంగ్రెస్ తర్వాత వైసిపి..
కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అంటేనే రెడ్డి సామాజిక వర్గం. అంతలా ఉండేది ఆ పార్టీలో సామాజిక వర్గ ప్రభావం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం కింద రెడ్డి సామాజిక వర్గమంతా పనిచేసింది. దీంతో 2004లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. 2009లో సైతం రెండోసారి అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి ముమ్మాటికి కారణం రెడ్డి సామాజిక వర్గం మద్దతు. రాజశేఖర్ రెడ్డి మరణంతో రెడ్డి సామాజిక వర్గమంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరింది. ఆ సామాజిక వర్గమంతా జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. రెడ్డి సామాజిక వర్గం నియోజకవర్గాల్లో సైతం ఇతరులకు అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి. తన ఐదేళ్ల పాలనలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలు లేకుండా పోయాయి. దీంతో ఆ సామాజిక వర్గం మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహాయ నిరాకరణ చేసింది.

* జగన్ వైఖరిలో మార్పు లేక..
అయితే ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వైఖరిలో మార్పు రావడం లేదు. రెడ్డి సామాజిక వర్గం విషయంలో ప్రత్యేక ఆలోచనలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో తమకోసం ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రెడ్డి సామాజిక వర్గం ప్రముఖులు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు రెడ్డి సామాజిక వర్గం ప్రముఖులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక ప్రత్యేక అజెండాతో ముందుకు సాగుతూ.. ఎన్నికల సమయానికి కలిసివచ్చే రాజకీయ పార్టీలతో ముందడుగు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయ పార్టీ ఏర్పాటుకు మరికొద్ది నెలలో ఒక తుది రూపు వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper