Homeఆంధ్రప్రదేశ్‌Ram Gopal Varma : ఆర్జీవి పరుగో పరుగు.. రేపు కోర్టు ఎలా ఉండబోతుందో?

Ram Gopal Varma : ఆర్జీవి పరుగో పరుగు.. రేపు కోర్టు ఎలా ఉండబోతుందో?

Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ.. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నానుతున్న పేరు ఇది. అత్యంత క్రియేటివ్ దర్శకుడు కూడా.అందుకే బాలీవుడ్లో సైతం ఆర్జీవికి మంచి క్రేజ్ ఉంది. కానీ అటువంటి రాంగోపాల్ వర్మ రూటు తప్పారు. వివాదాస్పదుడిగా మారారు. ఏపీ రాజకీయాల్లో తల దూర్చారు. ఒక పార్టీకి మద్దతుగా నిలుస్తూ ప్రత్యర్థులను తక్కువ చేసి మాట్లాడారు.సోషల్ మీడియా వేదికగా చేసి టార్గెట్ చేసేవారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైసిపి అధికారంలో ఉన్నన్నాళ్లు ఆర్జీవికి ఎదురులేకుండా పోయింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఆర్జీవికి కష్టాలు ప్రారంభమయ్యాయి. పాత కేసులు తెరమీదకు వచ్చాయి. వాటి నుంచి బయటపడలేక, కక్కలేని మింగలేని పరిస్థితి ఆయనది. ఈ పరిస్థితుల్లో ఆయన న్యాయస్థానాలనే నమ్ముకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరక కూడదని డిసైడ్ అయ్యారు.దొరికితే తన పరిస్థితి ఏంటో ఇప్పటికే న్యాయస్థానానికి విన్నవించారు.

* ఆ తప్పిదాలతోనే
మాజీ సీఎం జగన్ రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని వ్యూహం అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది ఆ చిత్రం.అయితే ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు,లోకేష్, పవన్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై సైతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆర్జీవి. ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. ఆర్జీవి పై ప్రకాశం జిల్లా టిడిపి నేత ఒకరు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి రాంగోపాల్ వర్మ కు కష్టాలు ప్రారంభం అయ్యాయి.

* థర్డ్ డిగ్రీకి భయపడి
ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి నోటీసులు అందించారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.అందుకు కొంత సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్జీవి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై విచారణను రద్దు చేయాలని కోరారు. ఒకవేళ తాను విచారణకు హాజరైతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో ఆర్జీవి పెట్టిన పోస్టులను చూసిన న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. పిటీషన్ రద్దు చేసింది. అవసరమైతే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అయితే ఇంతలో పోలీసులు ఇచ్చిన గడువు ముగియడం.. బెయిల్ పిటిషన్ పై కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఆర్జీవి పరారీలో ఉన్నారు.ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. అప్పటివరకు ఆర్జీవి వరకు పెట్టాల్సిందే. మరి రేపు ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version