https://oktelugu.com/

Sridevi Drama Company: ఏం ఊపావ్ రాంప్రసాద్.. రష్మీతో చెప్పించుకున్నావ్.. డ్రామా కంపెనీలో పరువుపోయిందిగా..

శ్రీదేవి డ్రామా కంపెనీ రాను రాను అడల్ట్ షోగా రూపాంతరం చెడుతుంది. తాజాగా రామ్ ప్రసాద్, రష్మీ చేసిన ఓ కామెడీ స్కిట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. డబుల్ మీనింగ్ జోక్స్ తో, ఒకింత హద్దులు దాటేశారు..

Written By:
  • S Reddy
  • , Updated On : November 26, 2024 / 06:21 PM IST

    Sridevi Drama Company(1)

    Follow us on

    Sridevi Drama Company: జబర్దస్త్ సంచలన కామెడీ షో. ఈ కామెడీ షో పేరిట ఉన్న రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను జబర్దస్త్ ఆకట్టుకుంది. ఆరంభంలో జబర్దస్త్ విమర్శల పాలైంది. కొన్ని వివాదాలకు కారణమైంది. ఓ కమ్యూనిటీ మీద బలగం వేణు చేసిన స్కిట్ వ్యతిరేకతకు దారి తీసింది. సదరు కమ్యూనిటీ వ్యక్తులు వేణుపై దాడి చేశారు. ఆయన్ని కొట్టారు. అలాగే హైపర్ ఆది వేసిన జోక్స్ కొందరు ప్రముఖులను హర్ట్ చేశాయి. ఆయన క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

    ఒక దశలో జబర్దస్త్ షోలో అడల్ట్ కామెడీ హద్దులు దాటేసింది. విమర్శల నేపథ్యంలో డబుల్ మీనింగ్స్ జోక్స్ డోసు తగ్గించారు. ప్రస్తుతం జబర్దస్త్ కి అంత క్రేజ్ లేదు. అనసూయ, రోజా, నాగబాబు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి స్టార్స్ ఆ షోకి దూరమయ్యారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఆదరణ పొందుతుంది. కామెడీతో పాటు డాన్స్, సింగింగ్ అండ్ ఇతర టాలెంట్స్ ప్రదర్శిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడం ఈ షో ప్రత్యేకత. ఈ షోకి హైపర్ ఆది ప్రధాన ఆకర్షణ.

    కాగా ఈ షోలో మరలా అడల్ట్ కామెడీ చోటు చేసుకుంటుంది. రామ్ ప్రసాద్ వేదిక మీద ఉన్నాడు. రష్మీతో పాటు మరొకరు తాడు తీసుకుని తిప్పుతుంటే రామ్ ప్రసాద్ స్కిప్పింగ్ చేశాడు. ఆయన పంచ కట్టులో ఉన్నాడు. రామ్ ప్రసాద్ ఎగురుతుండగా… ‘అటు ఇటు ఊగుతూ..’ అనే ఒక మెలోడీ సాంగ్ పెట్టారు. అయితే రామ్ ప్రసాద్ పంచ కట్టుకుని ఎగురుతున్న నేపథ్యంలో.. అది దారుణమైన డబుల్ మీనింగ్ కి దారి తీసింది. ఎగరడం ఆపేసిన రామ్ ప్రసాద్…. ఆ పాట ఏంట్రా అని అన్నాడు.

    వేదిక మీదున్న రష్మీ, జడ్జి ఇంద్రజ, షోలో ఉన్న మిగతా బుల్లితెర నటులు పగలబడి నవ్వారు. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇది ఫ్యామిలీ షోనా.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపైన అయినా.. ఇలాంటి అడల్ట్ కామెడీ తగ్గించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఫ్యామిలీ కలిసి చూసే బుల్లితెర షోల్లో డబుల్ మీనింగ్స్ జోక్స్ సరికాదని అంటున్నారు. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు ఏ మేరకు జనాల అభిప్రాయాలను కన్సిడర్ చేస్తారో చూడాలి…