Homeఆంధ్రప్రదేశ్‌AP Contaminated Milk Incident: అవయవాలు విఫలమై మృతి.. ఏపీ కల్తీ పాల వెనుక అసలు...

AP Contaminated Milk Incident: అవయవాలు విఫలమై మృతి.. ఏపీ కల్తీ పాల వెనుక అసలు నిజం తెలిసింది..

AP Contaminated Milk Incident: రాజమండ్రి ( Rajahmundry)కల్తీ పాల ఘటనకు సంబంధించి ఇంకా విషాదం కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరొకరు ప్రాణాలు వదిలారు. అయితే ఈ కల్తీ పాలు ఘటనకు సంబంధించి ఫోరేనిక్స్ ల్యాబ్ రిపోర్ట్ లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఆ పాలలో ఇథైలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిపినట్లు ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ కారణంగానే కిడ్నీలు దెబ్బతిని మరణాలు సంభవించినట్లు తేలింది. ఇప్పటివరకు ఈ పాల కల్తీ ఘటనకు […]

AP Contaminated Milk Incident: రాజమండ్రి ( Rajahmundry)కల్తీ పాల ఘటనకు సంబంధించి ఇంకా విషాదం కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరొకరు ప్రాణాలు వదిలారు. అయితే ఈ కల్తీ పాలు ఘటనకు సంబంధించి ఫోరేనిక్స్ ల్యాబ్ రిపోర్ట్ లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఆ పాలలో ఇథైలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిపినట్లు ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ కారణంగానే కిడ్నీలు దెబ్బతిని మరణాలు సంభవించినట్లు తేలింది. ఇప్పటివరకు ఈ పాల కల్తీ ఘటనకు సంబంధించి 11 మంది మృతి చెందారు. మరో 9 మంది చికిత్స పొందుతున్నారు. అందులో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సమగ్ర దర్యాప్తు చేయడంతో పాటు ల్యాబ్ కు పాల శాంపిల్స్ పంపించింది. ఈ నివేదికలు ఇప్పుడు వచ్చాయి.

Also Read: ప్రాధేయపతూనే గాంభీర్యం.. ఎందుకు ట్రంపూ ఇంత బలుపు?

* ప్రమాదకర అంశాలు వెలుగులోకి..
ల్యాబ్ నివేదికల్లో ప్రమాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పాలలో ఇథైలిన్ గ్లైకాల్( ethylene glycol ) అనే ప్రమాదకర రసాయనం కలిపినట్లు తేలింది. ఆ పాలు తాగడం వల్లే కిడ్నీలు దెబ్బతిని బాధితులు చనిపోయినట్లు నివేదికలు తేల్చాయని అధికారులు ప్రకటించారు. కాగా వీరికి గణేష్ అనే వ్యాపారి పాలను సరఫరా చేస్తుండేవారు. వరలక్ష్మి డైరీ పేరుతో పాలకేంద్రం నిర్వహిస్తున్నారు. పాల కేంద్రంలో పాలను నిల్వ చేసేందుకు ఒక ఫ్రీజర్ ఉపయోగించేవారు. అయితే ఫ్రీజర్ లీక్ కావడంతో గణేష్.. ఆ ప్రాంతంలో ఎంసీల్ అతికించారు. ఫిబ్రవరి 15న గణేష్ రోజు మాదిరిగానే అందరికీ పాలు పోశారు. అయితే అవి చేదుగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. కానీ గణేష్ పట్టించుకోకుండా పాలను ఆ ఇళ్లకు సరఫరా చేశారు. అయితే ఫ్రీజర్ నుంచి లీక్ అయిన కెమికల్స్ పాలల్లో కలిసి విషపూరితంగా మారినట్లు ల్యాబ్ నిర్ధారణ పరీక్షల్లో తేలింది.

* పోలీసుల అదుపులో నిందితుడు..
రాజమండ్రి కల్తీపాల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ పాలు తాగిన వారిలో అనూరియా( anuria ), అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను వైద్యులు గుర్తించారు. పోలీసులు పాల వ్యాపారి గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను రిమాండ్ లోనే ఉన్నారు. మరణించిన వారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా రసాయనాలు కలపలేదు కానీ.. ఎంసీల్ నుంచి వెలువడిన రసాయనం ఇంత హానికరంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper