Homeటాప్ స్టోరీస్Multitasking Strengths of Women : ‘అబల’ కాదు సకలకళా వల్లభ!

Multitasking Strengths of Women : ‘అబల’ కాదు సకలకళా వల్లభ!

Multitasking Women : “అమ్మాయివి.. ఓపిగ్గా ఉండాలి, సర్దుకుపోవాలి” – తరతరాలుగా ఆడపిల్లలకు ఇళ్లల్లో వినిపించే పల్లవి ఇది. కానీ ఈ ఓర్పు వెనుక కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అద్భుతమైన శాస్త్రీయ వాస్తవాలు, మేధోపరమైన సామర్థ్యాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలు కేవలం గృహ నిర్వహణకే పరిమితం కాదు.. వారు ప్రకృతి సిద్ధంగానే అద్భుతమైన ‘మల్టీ టాస్కర్లు’ అని సైన్స్ నిరూపిస్తోంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గొప్పతనంపై స్పెషల్ స్టోరీ

భావోద్వేగాల వారధి

మహిళల మెదడులో భావోద్వేగాలను గుర్తించే భాగాలు పురుషుల కంటే అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. అందుకే వారు ఇతరుల మనోభావాలను ఇట్టే పసిగట్టగలరు. స్పష్టమైన వాగ్ధాటి, భావ వ్యక్తీకరణలో వారిది పైచేయి. ఆర్థిక ప్రయోజనాల కంటే మానవ సంబంధాలకే పెద్దపీట వేసే గుణం మహిళలను సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతోంది. ఒకే సమయంలో అటు ఇంటిని, ఇటు ఉద్యోగాన్ని, పిల్లల బాధ్యతలను సమన్వయం చేసుకోవడం వారిలో ఉన్న అంతర్లీన నాయకత్వ లక్షణానికి నిదర్శనం.

ఒత్తిడిని జయించే ధీరత్వం

సాధారణంగా మహిళలను సున్నిత మనస్కులుగా భావిస్తాం. కానీ, మానసిక స్థైర్యంలో వారు పురుషుల కంటే ఎంతో ముందున్నారు. ఒత్తిడి ఎదురైనప్పుడు కుంగిపోకుండా తోటివారితో పంచుకుని పరిష్కార మార్గాలను వెతకడంలో వారు సిద్ధహస్తులు. గణాంకాల ప్రకారం ఆత్మహత్యల రేటు పురుషుల కంటే స్త్రీలలో తక్కువగా ఉండటమే వారి పోరాట పటిమకు సాక్ష్యం.

ప్రకృతి ఇచ్చిన వరం: వ్యాధి నిరోధక శక్తి

బలమంటే కేవలం కండరాల ప్రదర్శన కాదు.. అంతర్గత శక్తి. వ్యాధి నిరోధక శక్తి విషయంలో మహిళలు పురుషుల కంటే ఎంతో మెరుగ్గా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినికిడి సామర్థ్యం, రంగులను గుర్తించే తీరు, చివరకు ఆయుర్దాయం విషయంలో కూడా మహిళలదే పైచేయి కావడం విశేషం.

మహిళల్లో ఉన్న ఈ సహజ సిద్ధమైన నైపుణ్యాలను గుర్తించడం, వారిని ప్రోత్సహించడం సమాజ బాధ్యత. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. వారు చూపే టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకుంటే ఏ రంగమైనా అభివృద్ధి పథంలో నడుస్తుంది. నేటి ‘సూపర్ విమెన్’ కేవలం ఇల్లు దిద్దే ఇల్లాలు మాత్రమే కాదు.. ప్రపంచాన్ని నడిపించే శక్తి స్వరూపిణి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular