Rain Alerts: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు భారీగానే పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. సెప్టెంబర్ 11న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. గురు, శుక్ర వారాల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చె ప్పింది. ఇప్పటికే నదులు, వాగులు, వంకలు, చెరువులు అన్ని పొంగి పొర్లుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో రాష్ర్టమంతా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలతో పంటలు దెబ్బతిన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో తుపాను వస్తే పరిస్థితి ఏంటని రైతుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల పట్టణాలు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం కాస్త తెరపినివ్వడంతో జనం ప్రశాంతంగా ఉన్నారు.
తాజాగా ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 11న ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. దీంతో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. 13న నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీంతో ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. భారీ వర్షాలతో వరదలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.