Bandi Sanjay Yatra: భూమి తీసుకుని ‘రోడ్డు’న పడేశారు.. ‘బండి’ ఎదుట బోరుమన్న నిర్వాసితులు

-పాదయాత్రలో గోడు వెళ్లబోసుకున్న భూ నిర్వాసితులు -కనీస సౌకర్యాల్లేక ఇబ్బంది పడుతున్న జనం – పాదయాత్రలో బండి సంజయ్ ద్రుష్టికి తీసుకెళ్లిన ప్రజలు -నేడు పాదయాత్రకు విరామం -బస చేసిన ప్రాంతంలోనే గణపతికి పూజలు నిర్వహించనున్న బండి సంజయ్ కుమార్ Bandi Sanjay Yatra:  ‘‘సార్…రోడ్లు విస్తరణ కోసం మా ఇళ్లను కూల్చేశారు. మా భూమిని తీసుకున్నరు. తూతూ మంత్రపు పరిహారమిచ్చి మమ్ముల్ని రోడ్డున పడేసిండ్రు. మాకు ఉండటానికి ఇల్లు లేదు. గజం జాగా లేదు. పొలం […]

Written By: NARESH, Updated On : September 9, 2021 9:33 pm
Follow us on

-పాదయాత్రలో గోడు వెళ్లబోసుకున్న భూ నిర్వాసితులు
-కనీస సౌకర్యాల్లేక ఇబ్బంది పడుతున్న జనం
– పాదయాత్రలో బండి సంజయ్ ద్రుష్టికి తీసుకెళ్లిన ప్రజలు
-నేడు పాదయాత్రకు విరామం
-బస చేసిన ప్రాంతంలోనే గణపతికి పూజలు నిర్వహించనున్న బండి సంజయ్ కుమార్

Bandi Sanjay Yatra:  ‘‘సార్…రోడ్లు విస్తరణ కోసం మా ఇళ్లను కూల్చేశారు. మా భూమిని తీసుకున్నరు. తూతూ మంత్రపు పరిహారమిచ్చి మమ్ముల్ని రోడ్డున పడేసిండ్రు. మాకు ఉండటానికి ఇల్లు లేదు. గజం జాగా లేదు. పొలం లేదు. కనీసం డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం వల్ల అన్ని విధాలా నష్టపోయి బజారునపడ్డం’’ సంగారెడ్డి జిల్లా సారపల్లికి చెందిన పెంటయ్య కుటుంబ సభ్యులు బండి సంజయ్(Bandi Sanjay) ఎదుట వాపోయారు.

‘‘అన్నా…మా ఊరికి రోడ్లు లేవు. డ్రైనేజీ లేదు. తాగడానికి నీళ్లు కూడా లేవు. టీఆర్ఎస్ నాయకులు, అధికారులను ఎన్నిసార్లు కలిసినా పట్టించుకునే నాథుడే లేరు. మీరైనా మాకు అండగా ఉండి మా ఊరికి సౌకర్యాలు కల్పించండి’’ బండి సంజయ్ ఎదుట సుల్తాన్ పూర్ మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. ‘’అన్నా….టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఊరికి పైసా అభివ్రుద్ది జరగలేదు. ఒక్కరికీ కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదు. అధికారులు, నాయకులతో విసిగిపోయాం. బీజేపీ అండగా ఉండి మా ఊరిని అభివ్రుద్ది చేయండి’’ అల్మాయిపేటకు చెందిన గ్రామస్థులు బండి సంజయ్ ఎదుట వాపోయారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ 13వ రోజు సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ నుండి ప్రారంభమైన పాదయాత్ర సారపల్లి, చౌట్ కూర్, అల్మాయిపేట మీదుగా సంగూపేట సమీపంలోని లక్ష్మీనర్సింహాస్వామి ఫంక్షన్ హాల్ వరకు నడిచారు. దారి పొడవునా ప్రజలను కలుస్తూ వారి బాధలు వింటూ బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. అయితే 13వ రోజు ఏ గ్రామానికి వెళ్లినా భూ నిర్వాసితులే ఎక్కువగా కన్పించారు. రోడ్ల విస్తరణలో తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా తమకు తీవ్రమైన అన్యాయం చేశారని పలువురు వాపోయారు. డబుల్ బెడ్రూం ఇండ్లు లేవని, భూ నిర్వాసితులకు కనీస న్యాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల కోసం తమ ఇండ్లను, స్థలాలను, భూములను త్యాగం చేసిన ప్రజలు ఆయా గ్రామాల్లో పెంకుటిల్లలో, గుడిసెల్లో, శిథిలావస్థల్లో ఉన్న ఇండ్లలో నివాసమండటాన్ని గమనించిన బండి సంజయ్ ‘‘మీరేం బాధపడకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. రెండేండ్లు ఓపిక పట్టండి. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. మీ అందరికీ బీజేపీ న్యాయం చేసి తీరుతుంది’’అని హామీనిస్తూ ముందుకు కదిలారు.

-బండికి నీరా‘జనం’
ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన పాదయాత్రకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఆందోల్, నారాయణఖేడ్, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుండి వేలాది మంది తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో వేలాది మంది తరలివచ్చారు. దారి పొడువున్నా సంజయ్ పూల వర్షం కురిపిస్తూ…మంగళహారతులిస్తూ, బాణాసంచా పేలుస్తూ స్వాగతం పలికారు.

-నారాయణఖేడ్ నుండి వందలాది జనం రాక
పార్టీ రాష్ట్ర నాయకులు జె.సంగప్ప నాయకత్వంలో నారాయణఖేడ్ కు చెందిన 600 మంది ప్రజలు ప్రత్యేక వాహనాల్లో పాదయాత్రకు తరలివచ్చి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంజయ్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, అరుణతార ఆధ్వర్యంలో వందలాది వాహనాల్లో జనం తరలివచ్చి బండి సంజయ్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.

-13వ రోజు పాదయాత్రలో బండి వెంట నడిచిన నేతలు వీరే……
13వ రోజు పాదయాత్రలో బండి సంజయ్ వెంట పలువురు నేతలు నడిచారు. కర్నాటక రాష్ట్రం కోలార్ నియోజకవర్గ ఎంపీ మునుస్వామి, మాజీ మంత్రి బాబూ మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, బొడిగె శోభ, అరుణతార, ధర్మారావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఎస్.కుమార్, రాకేశ్ రెడ్డి, జె.సంగప్ప, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, ఉమారాణి, ఎస్సీ, బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఆలె భాస్కర్, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, యువ నాయకులు ఉదయ్ బాబూ మోహన్, గడీల శ్రీకాంత్ తదితరులు బండి సంజయ్ వెంట నడిచారు.