Guntur: ఆయన ఒక వర’ప్రసాదం’.. ఆరు కుటుంబాల్లో వెలుగులు

గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన సీనియర్ న్యాయవాది మునగపాటి ప్రసాద్ ఈనెల 2న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడి ఎన్నారై ఆస్పత్రిలో చికిత్సకు చేరారు. కానీ ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యింది.

Written By: Dharma, Updated On : July 6, 2024 9:26 am

Guntur

Follow us on

Guntur: ఒక నిర్ణయం ఆరు జీవితాలను నిలపనుంది. ఆరు కుటుంబాల్లో వెలుగులు తేనుంది. పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. తాము విషాదంలో ఉన్నా.. ఇతరులు మేలే కోరుకుంది ఆ కుటుంబం. అంతిమ దశలో ఉన్న తమ ఆత్మీయుడికి అర్థవంతమైన ప్రయాణం చూపించారు. అవయవ దానంతో ఆదర్శంగా నిలిచారు.

గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన సీనియర్ న్యాయవాది మునగపాటి ప్రసాద్ ఈనెల 2న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడి ఎన్నారై ఆస్పత్రిలో చికిత్సకు చేరారు. కానీ ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఇదే విషయాన్ని వైద్యులు ధ్రువీకరిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అవయవ దానంతో మరో ఆరుగురికి ప్రాణం పోయవచ్చు అని వివరించారు. దీంతో ప్రసాద్ భార్య సంధ్యారాణి ఉదారతత్వం ముందుకు వచ్చారు. అవయవ దానానికి సమతించారు. జీవన్దాన్ ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ అనుమతితో అవయవ దానం చేశారు.

బ్రెయిన్ డెడ్ తో ప్రసాద్ శరీర విభాగాలు దెబ్బతినకుండా దాదాపు 48 గంటలపాటు ఎన్నారై వైద్యుల బృందం అన్ని చర్యలు చేపట్టింది. అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. రాష్ట్రంలోని జీవన్ దాన్ కమిటీ నిర్ణయం మేరకు గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి, ఊపిరితిత్తులను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి, కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి, కళ్ళను శంకర్ నేత్రాలయానికి, ఒక మూత్రపిండాన్ని ఎన్నారై ఆస్పత్రికి, మరో మూత్రపిండాన్ని విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఎంతో మరో ఆరుగురికి ప్రసాద్ ప్రాణం పోసినట్టు అయ్యింది. ప్రసాద్ కు భార్య సంధ్యారాణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.