CNG Bike: సీఎన్‌జీ బైక్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

కొత్త బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 సీసీ బైక్‌కు 2 కేజీల సామర్థ్యం కలిగిన ట్యాంక్‌ ఉంటుంది. ఇదే పరిమాణంలో పెట్రోల్‌ ట్యాంకు కూడా ఉంటుంది. సీఎన్‌జీ, పెట్రోల్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. మైలేజ్‌ 330 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : July 6, 2024 9:22 am

CNG Bike

Follow us on

CNG Bike: బైక్‌ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్‌ విదేశీ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇక భారత మార్కెట్‌లో బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 పేరుతో లాంచ్ చేశారు. ఈ బైక్‌ ధరను రూ.95 వేలు(ఎక్స్‌ షోరూం)గా నిర్ణయించారు. ఇక ఈ సీఎన్‌జీ బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది. త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయి.

సీఎన్‌జీ బైక్‌ ప్రత్యేకతలు..

– కొత్త బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 సీసీ బైక్‌కు 2 కేజీల సామర్థ్యం కలిగిన ట్యాంక్‌ ఉంటుంది. ఇదే పరిమాణంలో పెట్రోల్‌ ట్యాంకు కూడా ఉంటుంది. సీఎన్‌జీ, పెట్రోల్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. మైలేజ్‌ 330 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

– బజాజ్‌ ఫ్రీడమ్‌ బైక్‌కు 125 సీసీ ఇంజిన్‌ ఉంటుంది. 8000 ఆర్‌పీఎం వద్ద 9.5 బీహెచ్‌పీ పవర్, 6000 ఆర్‌పీఎం వద్ద 9.7 ఎన్‌ఎం టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో ఉంటుంది.

సాధారణ బైక్‌లకు భిన్నంగా..
బజాజ్‌ ప్రీడమ్‌ 125 సీసీ బైక్‌ మార్కెట్‌లో లభించే ఇతర బైక్‌లకు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎస్‌ఈడీ హైడ్‌లైట్, డర్ట్‌ బైక్‌ ఫైల్‌ ఫ్యూయల్‌ ట్యాంక్, పొడవైన సింగిల్‌ పీస్‌ సీటు ఉన్నాయి. బ్లూటూత్‌ కనెక్టివిటీతో కూడిన డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి అప్‌డేట్‌ ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి.