Prashna Ravan: చేతిలో అపరిమితమైన డేటా.. ఫండింగ్ చేయడానికి వ్యక్తులు.. కావలసినంత విద్వేశం.. బుర్ర నిండా విషం.. ఇలా అనేక రకాల వ్యతిరేక ఆలోచనలతో.. కేవలం ఒకే ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ప్రశ్న రావణ్ విమర్శలు చేశాడు. వ్యక్తిగత ఆరోపణలకు దిగాడు . సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. చివరికి నక్సల్స్ ఉద్యమం వైపు యువత ఆసక్తి చూపించే విధంగా ప్రసంగాలు చేశాడు.
అతడి మూర్ఖపు ఆలోచనలను కొంతమంది సమర్థించారు. సినిమా షూటింగ్ లకు సక్రమంగా రాని ప్రకాష్ రాజ్ నుంచి మొదలుపెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నిత్యం విషం చిమ్మే తులసి చందు లాంటి స్వయం ప్రకటిత జర్నలిస్టు వరకు సపోర్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడం ఏపీ ప్రభుత్వం తీసుకున్న అత్యంత మూర్ఖపు నిర్ణయమని విమర్శించారు. చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జైలుకు పంపించారు. విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక కేసు పూర్తి కాగానే మరో కేసు.. మరో కేసు పూర్తిగా గానే ఇంకో కేసు అన్నట్టుగా మారిపోయింది. చివరికి ఆయనకు బెయిల్ కూడా లభించే పరిస్థితి లేకుండా పోయింది.
వామపక్ష ఉద్యమం వైపు యువతను రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలు చేయడం.. ఆయన వెనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారని పోలీసుల విచారణలో తేలడంతో.. ఆయనను మరింత లోతుగా ఎంక్వయిరీ చేయాల్సిన అవసరం ఉందని ఏపీ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎంక్వయిరీ చేయడానికి గన్నవరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఏడు రోజులపాటు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. పోలీసులు విన్నవించిన దానిపట్ల కోర్టు ఏకీభవించింది.
ప్రశ్నించడం అనేది మంచి పద్ధతి. కాకపోతే దానికి విధివిధానాలు అంటూ ఉంటాయి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వ్యవస్థలు ఊరుకోవు. ముఖ్యంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిని అంశాల ఆధారంగా విమర్శించాలి. అవసరమైతే ప్రాపర్ ఆధారాలతో విమర్శించాలి. అలాకాకుండా బోడి గుండుకి అరికాలికి ముడిపెట్టినట్టు.. అడ్డగోలుగా మాట్లాడితే పోలీసులు ఊరుకోరు. ఎవరో లక్ష్యాల కోసం అనుగుణంగా పనిచేస్తే.. నేటి రోజున ప్రశ్న రావణ్ జైలు పాలు కావాల్సి వచ్చింది. బెయిల్ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అతని రాక కోసం భార్య పిల్లలు ఎదురుచూస్తున్నారు. కానీ అతనిని పావుగా వాడుకున్నవారు.. మరో బకరా కోసం ఎదురుచూస్తున్నారు. అంతే తేడా.. రాజకీయ లక్ష్యాల కోసం పని చేసే వారి చేతిలో కీలుబొమ్మలాగా మారితే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈరోజు రావణ్.. రేపు మరెవరో..