SLBC Tunnel : సరిగ్గా 15 రోజుల క్రితం ఎస్ఎల్ బిసి టన్నెల్ లో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఆ కార్మికులు బయటికి వచ్చే వీలు లేకుండా పోయింది. నాటి నుంచి వారిని క్షేమంగా బయటికు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. కేంద్ర బలగాలు కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి. సింగరేణి సంస్థ రెస్క్యూ సిబ్బంది కూడా ప్రాణాలకు మించి సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ బలగాల సహాయం కూడా తీసుకుంటున్నది. ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు అక్కడ ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత జిల్లా కావడంతో ఆయన కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వివిధ బలగాలు రాత్రి పగలు సహాయక చర్యలు పాలుపంచుకుంటున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇటీవల మైనింగ్ హోల్ మైనర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలో పాలుపంచుకునేలా చేసింది. వారు రంగంలోకి దిగారు కాబట్టి.. పెద్దగా ఇబ్బంది ఉండదని.. కార్మికుల ఆచూకీ లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వారు కూడా చేతులెత్తేశారు. పేరుకుపోయిన బురద.. అంతకంతకు విస్తృతంగా వస్తున్న నీరు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
Also Read : ఎస్ఎల్ బీసీ లో సహాయక చర్యల్లో ర్యాట్ హోల్ మైనర్సే కాదు.. వారిని కూడా రంగంలోకి దించిన తెలంగాణ ప్రభుత్వం
15 రోజులు గడిచినప్పటికీ..
టన్నెల్ లో కార్మికులు చిక్కుకుపోయి 15 రోజులు గడుస్తున్నప్పటికీ.. వారి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. కార్మికులు ఇన్ని రోజులపాటు సజీవంగా ఉండడం అసాధ్యమని సహాయక చర్యలలో పాల్గొంటున్న బలగాలు చెబుతున్నాయి. ” బురద విపరీతంగా ఉంది. అక్కడికి వెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది. నీరు కూడా విపరీతంగా వస్తోంది. దానివల్ల సహాయక చర్యలు చేపట్టడానికి ఆటంకం కలుగుతుంది. ఇలాంటి సమయంలో ముందుకు వెళ్లాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. కాకపోతే ఇప్పటికే సమయం గడిచిపోయిందని” సహాయక చర్యలు చేపడుతున్న బలగాలు పేర్కొన్నాయి.. మరోవైపు టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆయనప్పటికీ వారి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఇక శుక్రవారం నుంచి కేరళ రాష్ట్రానికి చెందిన క్యాడవర్ డాగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. ఈ కుక్కలు బెల్జియన్ మాలినోస్ జాతికి చెందినవి. ఇవి 15 m లోతులో ఉన్న మానవ అవశేషాలను అత్యంత సులభంగా గుర్తిస్తాయి. ఇవి పొడుగ్గా.. ఉండడంవల్ల మానవ అవశేషాలను సులభంగానే కనిపెడతాయి. గతంలో అనేక సందర్భాల్లో కేరళ ప్రభుత్వం క్యాడవర్ డాగ్స్ సేవలను వినియోగించుకుంది. ప్రకృతి విపత్తులు అధికంగా చోటుచేసుకునే కేరళ రాష్ట్రంలో ఈశ్వర కాలు విశేషంగా సేవలందిస్తాయి.. వరదలు సంభవించినప్పుడు.. ముప్పులు ఏర్పడినప్పుడు మానవ అవశేషాలను గుర్తించడంలో వీటిని కేరళ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఆశలన్నీ అడుగంటి పోతున్న సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మానవ అవశేషాలను గుర్తించడానికి ఈ కుక్కలను రాష్ట్ర ప్రభుత్వం చివరి అవకాశంగా ఉపయోగించుకుంటున్నది.