Lenovo Tab Plus Gen 2: టాబ్లెట్ కొనేవారికి Lenovo కంపెనీ శుభవార్త తెలిపింది. లేటెస్ట్ గా అత్యధిక Resolution డిస్ప్లే తో కూడిన టాబ్లెట్ ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని గురించి కొందరు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త టాబ్లెట్లు డిజైన్ డిఫరెంట్ గా ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా అప్డేట్ అయ్యి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ట్రంప్ సీరియస్ యుద్ధంలో సీపీఐ నారాయణ కామెడీ
Lenovo కంపెనీ నుంచి Tab Plus 2024 జూన్ లో మార్కెట్లోకి వచ్చింది. అయితే దీనికి కొనసాగింపుగా Tab Plus Gen 2 అనే మొబైల్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించి టీమ్ స్టార్ ఇవాన్ బ్లాస్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొత్తగా వచ్చేTab Plus Gen 2 టాబ్లెట్ గ్రే కలర్ లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని డిస్ప్లే చుట్టూ బెజెల్ కనిపిస్తోంది. దీని లోపల ఉన్న కెమెరా కూడా ఈ పోస్టులో ఉన్నాయి.Tab Plus Gen 2 టాబ్లెట్ బ్యాక్ సైడ్ లో రౌండ్ షేప్ లో ఉన్న గ్రిల్ ఉండనుంది. ఇది స్పీకర్ చుట్టూ కిక్ స్టాండ్ ను కలిగి ఉంటుంది. నీకు ఎడమవైపు పవర్ బటన్, వాల్యూ బటన్స్ కనిపిస్తాయి. కుడివైపున నాలుగు కటౌట్లు ఉండే అవకాశం ఉంది. అంటే ఇవి అదనపు స్పీకర్ అని తెలుస్తోంది. ఇదే ప్రదేశంలో యూఎస్బీ టైప్ సి పోర్టు కూడా కలిగే ఉంది. ఇది డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ తో ఉండే అవకాశం ఉంది.
ఈ టాబ్లెట్ డ్యూయల్ మైక్రోఫోన్ సెట్ అప్ లో కలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టాబ్లెట్ కోసం ప్రత్యేకంగా స్లింగురోప్ కూడా ఉంటుంది. ఇందులో 8 GB రామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ టాబ్లెట్ లో డిస్ప్లే గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది 11.5 అంగుళాల 2 K Resolution తో పనిచేస్తుంది. పూర్తిగా LCD స్క్రీన్ కలిగిన దీనిని అమెజాన్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని ధర విషయం తెలియాల్సి ఉంది.
మొబైల్ కంటే అడ్వాన్స్ సాఫ్ట్వేర్ తో పాటు ఫీచర్స్ కలిగిన ఈ టాబ్లెట్ మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో మెరుగైన బ్యాటరీ ఉండడంతో రోజువారి వినియోగానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఒకవైపు దీనిని ప్రాజెక్టు కోసం ఉపయోగిస్తూనే మరోవైపు వినోదం కోసం వాడుకోవచ్చు.