Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి( Posani Krishna Murali ) చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై ఫిర్యాదులు రావడంతో ఏపీ పోలీసులు హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా పోసాని కృష్ణమురళి పై ఒకటి కాదు రెండు కాదు దాదాపు 17 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కొక్క కేసు రిమాండ్ నుంచి బయటకు వస్తుండగా.. మరో కేసు నమోదు చేస్తున్నారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నారు. దీంతో పోసాని ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది.
Also Read: గవర్నర్ అనుమతే తరువాయి.. విడదల రజిని చుట్టూ ఉచ్చు!
* 14 రోజుల రిమాండ్
తాజాగా కర్నూలు జిల్లా( Kurnool district) కోర్టు పోసాని కృష్ణ మురళిని 14 రోజులు రిమాండ్ విధించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోసానిపై కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అయితే ఇప్పటికే గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. ఆదోని పోలీసులు వచ్చి పోసానిని తమకు అప్పగించాలని జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. కోర్టులో హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
* అనారోగ్యంపై ఆందోళన గుంటూరులో( Guntur) రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం పై అనేక రకాల వార్తలు వచ్చాయి. ప్రధానంగా ఆయన చాతి నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో హడావుడి నడిచింది. వైద్య పరీక్షలు అనంతరం తిరిగి జైలుకు తరలించారు. అయితే కర్నూలు కోర్టు సైతం 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు పోసాని కృష్ణ మురళి. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. కర్నూలు హెడ్ క్వార్టర్స్ లోనే ఉంచాలని జడ్జిని కోరారు. అనంతరం పోలీసులు ఆయనను కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఈనెల 18 వరకు పోసాని రిమాండ్ లోనే ఉండనున్నారు.
* రాజకీయాలకు దూరం
వాస్తవానికి పోసాని కృష్ణ మురళి తాను రాజకీయాలకు( politics) దూరంగా ఉంటానని.. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అయితే గతంలో పోసాని కృష్ణమురళి వ్యక్తిగత దూషణలకు దిగారు. చాలా అనుచితంగా మాట్లాడారు. అందుకే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు పోసానిపై అక్రమంగా కేసులు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో అప్పట్లో పోసాని మాట్లాడిన వీడియోలను బయటపెడుతోంది తెలుగుదేశం పార్టీ. మొత్తానికి అయితే పోసానికి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.
Also Read: కిరణ్ రాయల్ వివాదంలో ట్విస్ట్.. యూటర్న్.. బాధితురాలు నోట జనసేన కీలక నేత కుట్ర కోణం