Homeఆంధ్రప్రదేశ్‌Posani Krishna Murali: చిరంజీవి నా ఇంటికి వచ్చి అలా అడిగితే 'దొబ్బేయ్' అంటాను అంటూ...

Posani Krishna Murali: చిరంజీవి నా ఇంటికి వచ్చి అలా అడిగితే ‘దొబ్బేయ్’ అంటాను అంటూ పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్!

Posani Krishna Murali: రచయితగా, దర్శకుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి. కమెడియన్ గా కూడా ఈయన బాగా పాపులర్ అయ్యాడు. ఒకప్పుడు ఏడాది 10 నుండి 20 సినిమాలు చేస్తూ క్షణకాలం తీరిక లేకుండా ఫుల్ బిజీ గా గడిపిన ఆయన, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి కెరీర్ ని సర్వనాశనం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఆయన 2009 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజా రాజ్యం’ పార్టీలో చేరాడు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఈయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. కానీ ఆ పార్టీ కాంగ్రెస్ లోకి విలీనం అయ్యాక, ఈయన వైసీపీ పార్టీలో చేరాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఈయన చేసిన నిర్వాకాలు అన్ని ఇన్ని కావు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వంటి వారిని ఇష్టమొచ్చినట్టు అడ్డమైన బూతులు తిట్టేవాడు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని, ఆయన ఇంట్లో ఆడవాళ్ళని, చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అడ్డమైన బూతులు తిట్టి శాపనార్దాలు పెట్టారు. ఆ వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ ని ద్వేషించే వాళ్ళు కూడా పోసాని కృష్ణ మురళి ని చెప్పు తీసుకొని కొడుతారు. అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసాడు ఆయన. ఈయనని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో, రీసెంట్ గా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మరోసారి చిరంజీవీ, పవన్ కళ్యాణ్ లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో అభిమానుల రక్తం ఉడికిపోయేలా చేస్తుంది. యాంకర్ ఇతన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘పోసాని గారూ..మెగాస్టార్ చిరంజీవీ మీ ఇంటికి వచ్చి..నా తమ్ముడు జనసేన పార్టీ లో చేరి, అతనికి అండగా నిలబడమని చెప్తే, మీరు ఆయన మాటని విని జనసేనలో చేరుతారా’ అని అడుగుతాడు.

దానికి పోసాని సమాధానం చెప్తూ ‘చిరంజీవి గారు ఒకవేళ నా ఇంటికి వచ్చి అలా అడిగితే, ఆయనని ముందుగా కూర్చోబెట్టి, టీ ఇచ్చి, ధన్యవాదాలు తెలిపి, నేను జనసేన పార్టీ లో చేరితే ఒక అమ్మా అబ్బకు పుట్టినవాడిని అవ్వను అన్నయ్యా, దయచేసి నన్ను క్షమించండి ఇక ఇక్కడి నుండి బయలుదేరండి అని అంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు పోసాని కృష్ణ మురళి. ఆయన మాట్లాడిన ఆ మాటలను మీరు కూడా క్రింది వీడియో లో చూడొచ్చు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు, నువ్వు లోకి రావడం కాదు, మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ఆవరణలో కనిపించినా నిన్ను చంపేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో పోసాని పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ స్పందించారు. అంతే కాదు, ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలను అడిగిన యాంకర్ ని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టసాగారు. అతన్ని పార్టీలోకి ఎవరు పిలిచారు?, ఎవరు పిలిచినట్టు అతను రెచ్చిపోవడం ఏమిటి?, వ్యూస్ కోసం ఎలాంటి వీడియోలను అయినా చేస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version