ABC Ratings: కొన్ని పత్రికలు అయితే కరోనా సమయంలో ఉద్యోగులను అడ్డగోలుగా ఇంటికి పంపించాయి. ఉన్న ఉద్యోగులతో అడ్డమైన చాకిరీ చేయించాయి. జీతం కూడా సగమేచ్చాయి. ఇంకా కొంతమంది ఉద్యోగులకు బలవంతంగా సెలవులు ఇచ్చాయి. ఇక వేతనం పెంపుదల కూడా సక్రమంగా చేపట్టలేకపోయాయి. దీంతో చాలా మంది పాత్రికేయులు నడి రోడ్డు మీద పడ్డారు. అయితే అప్పట్లో వారి విషయంలో అటు ప్రభుత్వాలు.. ఇటు యాజమాన్యాలు వీసమెత్తు మానవత్వం చూపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని ప్రింట్ మీడియా యాజమాన్యాల దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావు. పేరుకు పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కానీ.. అందులో పనిచేసే పాత్రికేయులకు కనీస హక్కులు ఉండవు.. ఇక ప్రస్తుతం చాలావరకు ప్రింట్ మీడియా హౌస్ లు ఉన్న వారితోనే పని చేయించుకుంటున్నాయి. కొత్తగా రిక్రూట్మెంట్లు జరపడం లేదు. తాజా ఏబిసి రేటింగ్స్ లో చాలా పత్రికలు తమ సర్కులేషన్ పెరిగిందని చెప్పుకున్నాయి కానీ.. వాస్తవంలో అంత సన్నివేశం లేదు. ఈ సర్కులేషన్ పెంపుదలను కచ్చితంగా రాజకీయ ప్రయోజనం కోణంలోనే చూడాల్సి ఉంటుంది. తాత్కాలికంగా ఈ పెరుగుదల ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మేనేజ్మెంట్లు కొనసాగించలేవు. తాత్కాలిక పెరుగుదలే మేనేజ్మెంట్లకు చుక్కలు చూపిస్తోంది.. ఇక ఆ ఏబిసి రేటింగ్స్ నే పరిశీలిస్తే.. జాతీయస్థాయిలో హిందీ పత్రికలు తప్ప.. మిగతా వాటి కాపీల సంఖ్య తగ్గింది. అంటే ప్రింట్ మీడియాకు భవిష్యత్తు కాలం లేదని.. ఇప్పుడున్నది బలుపు, వాపుల కాలం మాత్రమేనని చెప్పక తప్పదు.
జాతీయస్థాయిలో పరిశీలిస్తే..
ఏబిసి రేటింగ్స్ ప్రకారం జాతీయస్థాయిలో పరిశీలిస్తే దైనిక్ భాస్కర్ 30 లక్షల సర్కులేషన్ తో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దైనిక్ జాగరణ్ 24 లక్షలతో రెండవ స్థానంలో ఉంది. వీటి స్థాయికి రావడానికి తెలుగు పత్రికలు చేయలేవు. వాటికి అంత సీన్ కూడా లేదు. ఎందుకంటే హిందీ పత్రికలకు రీచ్ ఎక్కువ. తెలుగు పత్రికలు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే మనుగడ సాగించాలి. పైగా ఈ పత్రికలకు నిలువెల్లా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిబిలిటీ అత్యంత హీనంగా ఉంటుంది. ఇక ఆ మూడు పత్రికలను పక్కన పెట్టి మిగతా వాటి విషయానికి వస్తే.. వాటికి అంత సన్నివేశం లేదు. స్థూలంగా చెప్పాలంటే ఈనాడు, సాక్షిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఈ ప్రకారం వాటి మధ్య యుద్ధం ఇంకా కొద్దిరోజులు సాగుతుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కాబట్టి సాక్షి మీద ఏమైనా ప్రయోగాలు జరిగితే చెప్పలేం..