Posani Krishna Murali: వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి( Krishna Murali ) కష్టాలు వీడడం లేదు. ఇప్పట్లో తీరేలా కూడా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను విపరీతంగా దూషించారు పోసాని. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై వరుసగా కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే ఇప్పటికే వీటిపై కోర్టులను ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈసారి సిఐడి ఆయన పై నమోదు చేసిన ఫోటోల మార్ఫింగ్ కేసులో మాత్రం కస్తది తప్పడం లేదు. గుంటూరు కోర్టు ఆదేశాలతో సిఐడి ఈరోజు పోసానిని కస్టడీలోకి తీసుకుంది. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలు తయారుచేసి.. ప్రెస్మీట్లోకి తెచ్చి మరి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై సిఐడి దృష్టి పెట్టింది.
Also Read: లోకేష్ కు ప్రమోషన్.. చంద్రబాబు ప్లాన్ అదే!
* సిఐడి పీటి వారెంట్ తో
వాస్తవానికి అన్ని కేసులలో పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చింది. కర్నూలు జిల్లా జైలు( Kurnool district jail) నుంచి ఆయనకు విముక్తి కలిగింది. కానీ ఇంతలోనే సిఐడి పీటి వారెంట్ ఇచ్చింది. దీంతో కర్నూలు జిల్లా జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించాల్సి వచ్చింది. అయితే రిమాండ్ లో ఉన్న పోసాని కృష్ణ మురళిని ఈరోజు అదుపులోకి తీసుకొని విచారణ జరపనుంది సిఐడి. ఈరోజు విచారణలో ఫోటోల మార్ఫింగ్ ఎవరు చేయమన్నారు? ఎవరైనా ప్రోత్సహించారా? అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు.
* 26 వరకు రిమాండ్
పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగి దాదాపు 20 రోజులు సమీపిస్తోంది. ఈనెల 26 వరకు ఆయన రిమాండ్ ఉంది. గతంలో విచారణలో సజ్జల పేరును పోసాని కృష్ణమురళి బయట పెట్టారని ప్రచారం నడిచింది. అప్పట్లో సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ నే తాను చదివినట్లు కృష్ణ మురళి విచారణలో పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఈరోజు సిఐడి కీలక విచారణ చేపట్టనుంది. అయితే కృష్ణ మురళి కొత్తగా ఎవరి పేరు బయట పెడతారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
* సినీ పరిశ్రమ నుంచి విజ్ఞప్తి
మరోవైపు సినీ పరిశ్రమ( cinema industries) నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి కూటమికి అనుకూలంగా ఉండే సినీ నటుడు శివాజీ తాజాగా స్పందించారు. పోసాని కృష్ణ మురళి రియలైజ్ అయ్యారని.. ఆయన విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే మంచిది అని శివాజీ సూచించారు. రాజకీయ నాయకులు మాటలు జారితే పరవాలేదు కానీ.. రాజకీయాలతో అంతంత మాత్రం సంబంధం ఉంటే సినీ నటులు మాత్రం స్థాయికి మించి విమర్శలు చేయకూడదని అభిప్రాయపడ్డారు శివాజీ. మొత్తానికైతే పోసాని కృష్ణ మురళి వైపు నుంచి రాజీకి సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.