Nara Lokesh : నారా లోకేష్ కు( Nara Lokesh) కీలక పదవి లభించనుందా? పార్టీలో ప్రమోషన్ ఖాయమా? అందుకు మహానాడు వేదిక కానుందా? కడప జిల్లాలో జరిగే మహానాడు వేదికపై లోకేష్ పదవి పై ప్రకటన రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టిడిపిలో చంద్రబాబు తర్వాతే ఎవరంటే అందరూ లోకేష్ వైపే చూపిస్తున్నారు. కానీ దీనిని అధికారికంగా సాకారం చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకే ప్రత్యేక వ్యూహంతో లోకేష్ కు కీలక పదవి మహానాడు వేదికగా కట్టబెట్టనున్నట్లు సమాచారం.
Also Read : చంద్రబాబు సైడ్.. ఆ ఇద్దరికీ కీలక బాధ్యతలు!
* పార్టీలో పెరిగిన లోకేష్ పాత్ర
వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) లోకేష్ పాత్ర పెరిగింది. తెర వెనుక చేస్తోంది లోకేష్. అందుకే తెర ముందుకు తెచ్చి చంద్రబాబు సైడ్ అవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు తాత్కాలిక బాధ్యతలు ఒక నేతకు అప్పగించారు. అయితే ఇప్పుడు మహానాడు వేదికగా రెండు రాష్ట్రాలకు అధ్యక్ష పదవులతో పాటు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని తెలుస్తోంది. తద్వారా జాతీయ అధ్యక్షుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అన్ని రకాల హక్కులు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కెసిఆర్ ఇదే ప్లాన్ చేశారు. పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా కుమారుడు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అదే మాదిరిగా లోకేష్ కు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
* కడపలో మహానాడు
మే నెలలో మూడు రోజులపాటు మహానాడు( mahanadu) వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మహానాడు కావడంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మహానాడు వేదికను కడప జిల్లాకు ఎంపిక చేశారు. అయితే మహానాడు ఎక్కడ నిర్వహించాలి అన్నది ఫిక్స్ చేయలేదు. పులివెందులలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడ కాకుంటే జిల్లాలో ఏదో ఒక చోట ఘనంగా నిర్వహించాలన్నది చంద్రబాబు ప్లాన్. తద్వారా జగన్మోహన్ రెడ్డికి గట్టిగానే షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
* ముందుగా పార్టీలో
ముందుగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ ను ప్రమోట్ చేయాలని చంద్రబాబు( Chandrababu) భావిస్తున్నారు. తద్వారా టిడిపికి భావి నాయకుడు లోకేష్ అనే సంకేతాలు ఇవ్వనున్నారు. అయితే పార్టీలో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నారు లోకేష్. కానీ అదంతా తెర వెనుక మాత్రమే. ఇప్పుడు మహానాడు వేదికగా పార్టీ పూర్తి బాధ్యతలను లోకేష్ కు అప్పగిస్తారని సమాచారం. తద్వారా ఏపీ రాజకీయాల్లో లోకేష్ పాత్ర పెంచేందుకు చంద్రబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది.
Also Read: పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ వైరల్!