Bollywood Actress Comeback: ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?, ఈమె ఎవరో కొత్త కుర్ర హీరోయిన్ అనుకుంటే చాలా పెద్ద పొరపాటే. ఈమె వయస్సు 46 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్ కి దాదాపుగా తల్లి వయస్సు అన్నమాట. ఇంత వయస్సు లో ఈ రేంజ్ అందం లో గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఈ హీరోయిన్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా?, ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ లో ఎంతో కాలం అగ్రకథానాయిక గా కొనసాగి, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకొని, విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్(Vidya Balan). చాలా హోమ్లీ గా కనిపించే ఈమె ఇలా తయారు అయ్యిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ..ఇప్పటికిప్పుడు ఈమె కుర్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించగలదు. ఆ రేంజ్ లో మేకోవర్ అయ్యింది.
Also Read: Amardeep : బయటపడ్డ అమర్ దీప్ తో సురేఖావాణి రిలేషన్… అందుకే కూతురికి సినిమాలో ఆఫర్!
విద్యా బాలన్ 2003 వ సంవత్సరం లో ‘బాలో టేకో’ అనే బెంగాలీ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఇందులో ఆమెది చిన్న క్యారక్టర్ మాత్రమే. ఈ చిత్రం తర్వాత ఆమె ‘పరిణీత’ అనే చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం తో బాలీవుడ్ లో బడా దర్శక నిర్మాతల చూపు విద్యాబాలన్ పై పడింది. తమ సినిమాల్లో ఈమెని హీరోయిన్ గా తీసుకునేందుకు ఎగబడ్డారు. ‘పరిణీత’ తర్వాత ఈమె చేసిన చిత్రం ‘లగే రహో మున్నాభాయ్’. సంజయ్ దత్ హీరో గా నటించిన ఈ చిత్రం అప్పట్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ‘మున్నా భాయ్ MBBS’ చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగు లో ‘శంకర్ దాదా జిందాబాద్’ పేరుతో మన మెగాస్టార్ చిరంజీవి దీనిని రీమేక్ చేశాడు. బాలీవుడ్ లో ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో విద్యాబాలన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
View this post on Instagram
ఈ సినిమా విడుదలైన మరుసటి సంవత్సరం లో ఈమె నుండి ఆరు సినిమాలు విడుదల అయ్యాయి అంటే అప్పట్లో ఈమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. అలా వరుసగా మంచి సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ, సూపర్ హిట్స్ ని అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికీ కూడా ఈమె సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘భూల్ బులియా 3’ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక తెలుగు లో ఈమె ఇప్పటి వరకు రెండే సినిమాల్లో నటించింది. ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కాగా,మరొకటి ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం. ఇందులో ఈమె ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యారక్టర్ లో నటించింది. రాబోయే రోజుల్లో ఈమె ఎలాంటి క్యారెక్టర్స్ లో కనిపించబోతుందో చూడాలి.