Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో క్రియాశీలక పాత్ర పోషించారు. జనసేన పార్టీ తరఫున శత శాతం విజయాన్ని నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా తన దృష్టిని ఆకర్షించగలిగారు. ఇప్పుడు పాలనలో కూడా తనదైన ముద్ర చాటుతున్నారు. రెండు రోజుల కిందట ఉమ్మడి విశాఖ జిల్లాలో మన్య ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సమయంలో తన చిన్న కుమారుడు అగ్ని ప్రమాదానికి గురై సింగపూర్ ఆసుపత్రిలో చేరాడు. గిరిజనులకు ఇచ్చిన మాట కోసం ఓ మారుమూల గ్రామానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ నేషనల్ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దీంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కోసం మరోసారి చర్చకు దారి తీసింది. అదే సమయంలో పవన్ ప్రాధాన్యం, పనితీరును వివరిస్తూ జనసేన పార్టీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. విపరీతంగా వైరల్ గా మారింది.
Also Read : పెద్ద కొడుకు పుట్టినరోజున చిన్న కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది – పవన్ కళ్యాణ్
* గిరిజనులకు ఇచ్చిన మాట కోసం..
ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గిరిజనులపై( tribals ) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అడవి తల్లి బాట( Adavi thalli Bata ) కార్యక్రమాన్ని రూపొందించారు. అందుకుగాను విశాఖ మన్యంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించేందుకు ముందుగానే షెడ్యూల్ రెడీ చేశారు. అయితే ఆయన పర్యటన రెండో రోజు ఉదయాన్నే ఓ చేదు వార్త వినాల్సి వచ్చింది. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. సహజంగానే ఒక తండ్రిగా ఎవరైనా ఆందోళనకు గురవుతారు. ఎంత పెద్ద కార్యక్రమం అయినా రద్దు చేసుకొని బయలుదేరి వెళ్తారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పని చేయలేదు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మరి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. దీనికి కారణం లేకపోలేదు. తొలి రోజు కార్యక్రమంలో ఓ గిరిజన వృద్ధురాలు తమ గ్రామానికి రమ్మంటూ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. దీనికి ఆయన ఓకే చెప్పారు. తమ గ్రామానికి పవన్ వస్తారని మాట ఇచ్చినా.. తన చేతిలో చేయి వేసి మాట తీసుకున్నారు ఆ వృద్ధురాలు. తప్పనిసరిగా రావాలని.. తమ కష్టాలను చూడాలని విన్నవించారు. అందుకే ఆమెకు ఇచ్చిన మాట కోసం కురిడి గ్రామానికి వెళ్లి వచ్చాకే తాను సింగపూర్ బయలుదేరి వెళ్తానని పవన్ భావించారు. బాధను దిగమింగుకొని కార్యక్రమాన్ని ముగించారు. మూడు నిమిషాల 30 సెకండ్లు ఉండే ఈ వీడియోలో రెండు రోజులపాటు ఏజెన్సీలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
* ఆకట్టుకుంటున్న ప్రత్యేక కథనాలు..
అయితే పవన్ పర్యటనలో ఈ పరిణామాలను గమనించిన ఓ నేషనల్ మీడియా( National media) ప్రత్యేక కథనాలను ప్రచురించింది. కుమారుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా.. గిరిజనులకు ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ ఉండిపోయారని చెబుతూ ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది జనసేన. ఆ వీడియోలో ఆయన గిరిజనులతో మమేకం కావడం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం.. పవన్ పై నేషనల్ మీడియా ప్రచురించిన కథనాలు ఉన్నాయి. ఇక చివర్లో మార్పు శంకర్ కోలుకోవాలంటూ ఫోటో పెట్టారు. పవన్ కళ్యాణ్ చిత్రాలకు మించి ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
#AdaviThalliBaata Exclusive video
Pawan Kalyan – A Revelation in Indian Politics !#PawanKalyanAneNenu pic.twitter.com/UQzsNtMNo2
— JanaSena Party (@JanaSenaParty) April 9, 2025