Alekhya Chitti Pickles: సోషల్ మీడియాలో ఇప్పుడు అలేఖ్య చిట్టి పీకిల్స్ పేరు మారుమోగుతోంది. పికిల్స్ బిజినెస్ ద్వారా ఫేమస్ అయిన ముగ్గురు అక్కచెల్లెళ్ల గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. వీళ్ళ పికిల్స్ బిజినెస్ బాగానే డెవలప్ అయింది. కానీ కొన్ని మాటలు వల్ల రచ్చ రచ్చ అయిపోయింది. పికిల్స్ రేట్స్ పై ఒక వ్యక్తి ప్రశ్నలు వేయడంతో ఆ వ్యక్తిపై ఆ వ్యక్తిపై ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఒకరు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యల బాధితుడికి నెటిజెన్లు సపోర్టు ఇవ్వడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ దెబ్బ తినే స్థాయికి వచ్చింది. అంతేకాకుండా తాము చేసింది తప్పేనని క్షమించాలని కోరుతూ ముగ్గురు అక్కచెల్లెల్లో ఒకరు వీడియో రిలీజ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే మరోవైపు వీరికి కొందరు ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే నా అన్వేషణ అనే యాత్రికుడు అలేఖ్య చిట్టి పికిల్స్ కి సపోర్ట్ గా నిలిచి వాక్యాలు చేశారు. అలాగే తాజాగా మరో సెలబ్రిటీ.. బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ తాజాగా ఆడియోను రిలీజ్ చేసింది. అదేంటంటే?
Also Read: సింపుల్ సూపర్ ఈ బ్యూటీ. అందానికే మరో పేరులా ఉందిగా
బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఆడియోను రిలీజ్ చేసింది. ఈ ఆడియో పై కూడా నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆడియోలో ఏముందంటే..’అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారస్తులు చేసిన వాక్యాలు ఎవరైనా చేస్తారు. కోపం వచ్చినప్పుడు ఎవరైనా బూతులు మాట్లాడతా ఉంటారు. ఈ మాటలను ఆడపిల్లలు కూడా మాట్లాడవచ్చు. అయితే ఎవరితో మాట్లాడుతున్నాం..? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం..? అనే విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మనం మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? లేదా? అనేది కూడా తెలుసుకోవాలి.
అలేఖ్య చిట్టి పీకిల్స్ వారిని ఒక ప్రశ్న అడిగినందుకు వారు బూతులు తిట్టిన ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియో విని చాలామంది ఎంజాయ్ చేశారు. అయితే ఈ ఆడియో పై రియలైజ్ అయిన అక్కా చెల్లెలు తిరిగి స్వారీ చెప్పారు. ఒకరు టోల్స్ తట్టుకోలేక ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తప్పు ఎవరైనా చేస్తారు. ఆ తర్వాత క్షమాపణ కోరుతూ ఆ తప్పును తెలుసుకుంటారు.
కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ పై వ్యతిరేకంగా ట్రోల్ చేసిన వారు ఎవరు పత్తితులు కాదు.. వాళ్లు పరవాన్నం పండితే తెల్లారి వరకు చల్లారదు.. అంటూ గీతు రాయల్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వీడియో పై నేటిజన్లో మరో రకంగా స్పందిస్తున్నారు. అలేఖ్య చిట్టి వారికి సపోర్ట్ చేయడంపై ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వారికి సపోర్ట్ ఉండగా.. తాజాగా గీతూ రాయల్ చేయడంపై ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఈ వివాదం ముగిసిపోతుంది అనుకుంటే రోజుకు రకంగా మలుపు తిరుగుతోందని మరికొందరు ఆసక్తిగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రోజుకో ఆడియో రిలీజ్ అవుతూ సంచలనాలు రేపుతుంది.
View this post on Instagram