Pawan Kalyan : సింగపూర్ సమ్మర్ క్యాంప్ స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురి 15 మంది పిల్లలు తీవ్ర గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది పిల్లలను హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రాధమిక చికిత్స ఇవ్వడంతో ప్రాణాపాయం నుండి కోలుకున్నారు. కానీ చిన్నారి మాత్రం ఈ ప్రమాదంలో చనిపోయింది. మార్క్ శంకర్(Mark Shankar) చేతులకు, కాళ్లకు గాయాలు అయ్యాయి కానీ, నల్ల పొగ పీల్చడంతో ఊపిరి తీసుకోవడానికి కాస్త ఇబ్బంది అయ్యింది కానీ ప్రస్తుతానికి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియా కి తెలిపారు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన జూబ్లీ హిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘దురదృష్టం కొద్దీ నేడు జరిగిన అగ్ని ప్రమాదం లో నా చిన్న కొడుకు తో పాటు పిల్లలందరూ గాయాలపాలయ్యారు, ఒక చిన్నారి కూడా చనిపోయింది. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. నా కొడుకు పక్కనే కూర్చున్న ఒక అబ్బాయికి అయితే చాలా సీరియస్ గా ఉంది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు చిన్నది అని ముందుగా అనుకున్నాను కానీ, చాలా పెద్ద అగ్ని ప్రమాదం అని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. ప్రస్తుతానికి నా కొడుకు బాగానే ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది, నల్ల పొగ పీల్చడం తో భవిష్యత్తులో వాడి ఆరోగ్యం పై సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితి రేపు ఉదయం తెలుస్తుంది. నేను కూడా కాసేపట్లో సింగపూర్ కి బయలుదేరుతున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : వారానికి 43 వేల ఫీజు.. ఏం నేర్పిస్తారంటే? సింగపూర్ స్కూల్ లో జరిగింది ఇదే!
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేడు నా పెద్ద కొడుకు అకిరా(Akira Nandan) పుట్టినరోజు. ఈరోజునే నా చిన్న కొడుక్కి ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే నా భార్య తీవ్రమైన భయాందోళనకు గురైంది. ఆమె పరిస్థితి కూడా ఇప్పుడు ఏమి బాగలేదు. తండ్రి గా నాకు ఇది చాలా కష్టసమయం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) గారు ఫోన్ చేసి నా బిడ్డ ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీశారు. ఎలాంటి అవసరం వచ్చినా సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారికి కృతఙ్ఞతలు. అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గారు, మంత్రి లోకేష్(Nara Lokesh) గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan Mohan Reddy) గారు కూడా దీనిపై స్పందించారు. వాళ్లందరికీ నా కృతఙ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తుంటే మార్క్ శంకర్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు అనేది అర్థం అవుతుంది.