Pawan Kalyan: ఒక వ్యక్తి స్థాయి ఏంటి అనేది నిర్ణయించేంత గొప్ప వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎన్ని శిఖరాలను అధిరోహించగలడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. అలాగని ఎవర్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సమయం వచ్చినప్పుడు గడ్డి పరక కూడా గండ్ర గొడ్డలిగా మారుతుంది. గుండు పిన్ను కూడా గునపంగా తయారవుతుంది.
చేతిలో ఉన్న పెన్ను కూడా గన్ను అవుతుంది. ఇక ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత ఆయన పవన్ కళ్యాణ్ ని వైసిపి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే వస్తుంది. అయిన కూడా ఎప్పుడూ తను వెనక్కి తగ్గలేదు. తను నమ్ముకున్న విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. తనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది ప్రజలు తనను నమ్మే రోజు ఒకటి వస్తుందని ఓపిగ్గా పది సంవత్సరాలపాటు ఎదురుచూస్తూ వస్తున్నాడు. సరిగ్గా 2024 ఎలక్షన్లలో అనుకున్నది జరిగింది.
Also Read: CM Chandrababu: చంద్రబాబు పని రాక్షసుడు
ఎంతలా అంటే తను పిఠాపురం ఎమ్మెల్యే గా 70 వేల పై చిలుకు మెజారిటీతో గెలవడమే కాకుండా తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 ఎమ్మెల్యేలతో పాటు రెండు ఎంపీ సీట్లను కూడా గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు కదులుతున్నారు. ఇక ఇప్పటివరకు ఏ పార్టీకి సాధ్యం కానీ రీతిలో పోటీ చేసిన సీట్లు గెలవడం అనేది ఒక అరుదైన రికార్డు అనే చెప్పాలి… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. “ఓడిపోవడం, పడిపోవడం కాదు. ఎప్పటికైనా మనకంటూ ఒక రోజు వస్తుందని ఓపికగా నిలబడ్డవాడే గొప్పవాడు వాడికి విజయం వరిస్తుంది” అనేది పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు..
Also Read: CM Chandrababu: జగన్ ఫోటోకు చంద్రబాబు యాక్సెప్ట్.. ఏపీకి కావాల్సింది అదే కదా?
ఇక ప్రతి రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కష్టపడుతూ ముందుకు వెళితే తప్పకుండా సక్సెస్ సాధిస్తామని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన విక్టరీని సాధించి తనను విమర్శించిన వాళ్ళ చేతే ప్రశంశల వర్షం కురిపించుకుంటున్నాడు. ఇక సక్సెస్ అంటే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యుత్తమమైన పాలనను అందించాలని కోరుకుందాం…