Lavanya Tripathi: మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. అందుకు కారణం జనసేన పార్టీ సాధించిన విజయం. కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకు భారీ మెజారిటీ వచ్చింది. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే 2 ఎంపీ స్థానాలు కూడా జనసేన కైవసం చేసుకుంది. ఇక నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ సైతం ఇదే వేదిక మీద ప్రమాణస్వీకారం చేయడం విశేషం.
ఈ కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని వీక్షించేందుకు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్ సైతం హాజరయ్యారు. వీరితో పాటు మెగా కోడలు లావణ్య త్రిపాఠి కనిపించలేదు. ఆమె గైర్హాజరు కావడానికి కారణం ఏమిటో సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
లావణ్య త్రిపాఠి కాలికి గాయమైనట్లు సమాచారం. సపోర్టర్ ధరించి ఉన్న గాయమైన కాలి ఫోటో లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడే నయం అవుతుందని ఆ ఫోటోకి కామెంట్ జోడించింది. లావణ్య త్రిపాఠి కాలికి గాయం కావడం వలనే ఆమె పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి లావణ్య త్రిపాఠి రాలేకపోయారని తెలుస్తుంది.
Also Read: Nayanthara: స్టార్ హీరోకి హ్యాండ్ ఇచ్చిన నయనతార… రంగంలోకి సమంత!
కాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళు రహస్యంగా డేటింగ్ చేసిన ఈ జంట 2023 నవంబర్ నెలలో పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి నటించడం విశేషం. మిస్ పర్ఫెక్ట్ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేసింది. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన లావణ్య త్రిపాఠి… భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.