OTT: పంథా మార్చిన ఓటీటీ సంస్థలు… లాభాల కోసం కొత్త టెక్నిక్!

OTT: మొబైల్స్, టీవీలలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ని వాడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ప్రేక్షకుల అభిరుచి, సినిమాను చూసే కోణం కూడా మారిపోయింది. యూనిక్ అండ్ న్యూ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది.

Written By: S Reddy, Updated On : June 13, 2024 2:28 pm

OTT companies are a new technique for profit

Follow us on

OTT: ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పెనుమార్పులకు లోనైంది. ఓటీటీ అతిపెద్ద మార్కెట్ గా అవతరించింది. కరోనా పరిస్థితులు ఓటీటీ సంస్థలకు మరింత ఆదరణ తెచ్చిపెట్టాయి. దాదాపు ఓ ఏడాది కాలం జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో మూవీ లవర్స్ ని ఓటీటీ సంస్థలు ఆకర్షించాయి. గతంలో ఓటీటీ కంటెంట్ చూసే ప్రేక్షకులు చాలా తక్కువ ఉండేవారు. హాట్ స్టార్ వంటి ఫ్లాట్ ఫార్మ్స్ స్పోర్ట్స్, సీరియల్స్, గేమ్ షోస్, సినిమాలు, వెబ్ సిరీస్లు… ఒకే చోట అందిస్తున్నాయి.

మొబైల్స్, టీవీలలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ని వాడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ప్రేక్షకుల అభిరుచి, సినిమాను చూసే కోణం కూడా మారిపోయింది. యూనిక్ అండ్ న్యూ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో ఓటీటీ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటుంది. అత్యధిక చందాదారులతో హాట్ స్టార్ అందరికంటే ముందు ఉంది. జియో సినిమా, ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇండియన్ మార్కెట్ ని కొల్లగొట్టాలని ట్రై చేస్తున్నాయి.

Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బాటలో అనసూయ… వాస్తవం తెలిసొచ్చిందా?

అయితే కొన్ని చిన్న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కొత్త టెక్నిక్స్ అవలంబిస్తున్నాయి. యూనిక్ కంటెంట్ కి బదులు డబ్బింగ్ కంటెంట్ అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక ఫ్లాట్ ఫార్మ్ లో సక్సెస్ అయిన సిరీస్లు, సినిమాలు మరొక ఫ్లాట్ ఫార్మ్ లో డబ్బింగ్ చేసి వదులుతున్నాయి. దీని వలన ఎక్కువ మంది ఆడియన్స్ రాబడుతున్నాయి.

Also Read: Family Stars Promo: ప్యాకప్ అయ్యాక నన్ను కలువు… పెళ్ళైన యాంకర్ ని నేరుగా అడిగేసిన సుడిగాలి సుధీర్!

యూనిక్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం సమయం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఎక్స్ క్లూజివ్ కంటెంట్, ఒరిజినల్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. ఎంఎక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీ వంటి లోకల్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కంటెంట్ షేరింగ్ కి పాల్పడుతున్నాయి. ఆ విధంగా మంచి వ్యూస్ రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే లాంగ్ టర్న్ లో ఈ ప్రాక్టీస్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.