Cooku With Jathiratnalu 2 : స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు సాగుతున్న షోస్ లో ఒకటి ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’. మొదటి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా జాతి రత్నాలు అద్భుతమైన కామెడీ ని పంచడం తో , ఫ్యామిలీ ఆడియన్స్ ఈ షోని నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు. మొదటి సీజన్ లో కేవలం 20 ఎపిసోడ్స్ మాత్రమే ఉండగా, రెండవ సీజన్ లో ఇప్పటికే 30 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. ఆగష్టు 15 వరకు ఈ షో టెలికాస్ట్ కానుంది. నిన్ననే ఈ సీజన్ కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని పూర్తి చేశారు. టైటిల్ విన్నర్ గా తనూజ నిలబడగా, రన్నర్ గా డిమోన్ పవన్ నిలిచారు. దీని సంగతి పక్కన పెడితే నేడు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ఎక్సక్లూసివ్ అప్డేట్స్ ని మీకోసం అందించబోతున్నాం.
ఈ ఎపిసోడ్ లో రాకేష్ అద్భుతమైన వంటకాలతో జడ్జీలను మైమరపించారు. బోనాలు జాతర థీమ్ లో సాగిన ఈ ఎపిసోడ్ లో రాకేష్ తన వింటేజ్ పల్లెటూరు వంటకాలను వండించి , సత్తా చాటారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కి కూడా ఇవ్వని రేంజ్ లో జడ్జీలు రాకేష్ కి మార్కులు ఇచ్చారు. ఇదొక హిస్టరీ అనే చెప్పాలి. అయితే ప్రతీ ఎపిసోడ్ లోనూ తన అద్భుతమైన వంటకాలతో జడ్జీలను మెప్పించే డిమోన్ పవన్ మాత్రం అందరికంటే తక్కువ మార్కులు సంపాదించుకున్నారు. దీంతో ఆయన ఏకంగా ఎలిమినేషన్ రౌండ్ లో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. డిమోన్ పవన్ కి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేటి ఎపిసోడ్ లో ఆయనకు తక్కువ మార్కులు వచ్చినట్టు ప్రకటించిన జడ్జీలు, రేపు జరగబోయే ఎపిసోడ్ లో కుక్ ఆఫ్ లో పాల్గొనాలని చెప్పారు.
రేపు డిమోన్ పవన్ తో పాటు , అతి తక్కువ మార్కులు సంపాదించుకున్న శ్రవణ్ కూడా ‘కుక్ ఆఫ్’ రౌండ్ లో పాల్గొనబోతున్నారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన పోటీ లో , డిమోన్ పవన్ గెలిచి షో లో కొనసాగగా, శ్రవణ్ మాత్రం ఎలిమినేట్ అయ్యారు. మొదటి రెండు వారాల్లో వెరైటీ వంటకాలతో జడ్జీలను మెప్పించారు శ్రవణ్ . కానీ గత వారం ఆయన బాగా వెనుకబడ్డారు , ఈ వారం కూడా ఆయన మెప్పించలేకపోయారు. అందుకే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా వచ్చిన ఈయన కేవలం నాలుగు వారాలకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. గత వారం లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చిన సుమిత్ ఎలిమినేట్ అయ్యారు. తదుపరి రెండు ఎలిమినేషన్స్ కూడా వైల్డ్ కార్డ్స్ లోనే ఉంటుందట.
