Pawan Kalyan 11 MLA Fear: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అది కూడా ప్రాంతాలవారీగా. ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు గెలిచారు. కోస్తా ఆంధ్ర నుంచి మరో ఇద్దరు గెలిచారు. రాయలసీమలో జగన్‌తో పాటు గెలిచారు. మొత్తం 11 మందిలో కొత్త వారే అధికం. పైగా అందులో ఎస్టీ నియోజకవర్గంలో నుంచి ఇద్దరు, ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల నుంచి ఇద్దరు, ఆపై పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరు గెలిచారు. అయితే రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను తక్కువ చేసి మాట్లాడలేము కానీ.. వారిపై స్థానికంగా ఎలాంటి ముద్ర ఉంటుందో తెలుసు. వారు పేరుకే ఎమ్మెల్యేలు కానీ తెర వెనుక అక్కడ లోకల్ నాయకులే రాజ్యం ఏలుతారు. వారిని కలుపుకెళ్లకపోతే వచ్చే ఇబ్బందులు వారికి తెలుసు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ 11 మంది పవన్ కళ్యాణ్ ను భయపెడుతున్నారట. ప్రభుత్వానికి దడ పుట్టిస్తున్నారట. ఈ మాట చెప్పి ముసిముసి నవ్వుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నిన్ననే వారాంతపు ప్రెస్ మీట్ పెట్టారు. సొంత మీడియా ఛానల్ ప్రతినిధి ఆ విషయం ఉప్పందిస్తే తెగ సంతోషం వ్యక్తం చేస్తూ.. మా 11 మంది ఎమ్మెల్యేలు 1100 మందితో సమానం అంటూ పవన్ కళ్యాణ్ భయపడిపోయారంటూ వ్యాఖ్యానించి ఆనందపడ్డారు జగన్మోహన్ రెడ్డి.
Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
* పవన్ కీలక వ్యాఖ్యలు..
ఇటీవల శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్( deputy speaker Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లలో అభివృద్ధి పనులు బాగానే చేసిందని.. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని.. అయినా సరే చేసింది చెప్పుకోలేకపోతున్నామని.. కూటమిలో ఐక్యత అవసరమని… వారు 11 మంది ఉన్నా 1100 మంది గా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. సభకు రాకుండా చేస్తున్న దుష్ప్రచారంపై విమర్శలు చేశారు. అయితే అదేదో పవన్ కళ్యాణ్ తమ 11 మంది ఎమ్మెల్యేలను భయపడిపోయారు అంటూ వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి.
* అప్పుడే భయపడలేదు..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 22 ఎంపీ స్థానాలను సొంతం చేసుకుంది. మరో పదకొండు రాజ్యసభ స్థానాలను సొంతం చేసుకుంది. ఓ 40 మంది వరకు ఎమ్మెల్సీలు అయ్యారు. ఒక వంద మంది వరకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు పొందారు. అంటే సుమారుగా 250 మంది వరకు కీలక ప్రజాప్రతినిధులు ఉండేవారు. ఇక సలహాదారులతోపాటు సోషల్ మీడియా కాలకేయ సైన్యం ఉండేది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ భయపడలేదు. వారాహి రథం పై తిరుగుతూ.. కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచే సౌండ్ చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ది. అటువంటిది సభకు రాని.. అసలు ఎమ్మెల్యేలే ఉన్నారన్న సంగతే మరిచిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు అంటూ చేస్తున్న కామెంట్స్ చూసి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.