Homeఆంధ్రప్రదేశ్‌KA Paul Iran Israel War: యుద్ధం ఆపే పనిలో కేఏ పాల్.. కామెడీ కాదు!

KA Paul Iran Israel War: యుద్ధం ఆపే పనిలో కేఏ పాల్.. కామెడీ కాదు!

KA Paul Iran Israel War: ప్రపంచవ్యాప్తంగా అశాంతి వాతావరణం నెలకొంది. పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇప్పుడే కాదు ప్రపంచంలో ఎప్పుడూ యుద్ధాలు జరుగుతున్నా.. ఐక్యరాజ్యసమితి తో పాటు ప్రపంచ శాంతి సంస్థలు మౌనంగానే ఉంటున్నాయి. పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. యుద్ధాన్ని నిలిపివేసే చర్యలు లేవు. చర్చలతో శాంతి అనేది అసాధ్యం అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ మన తెలుగు వాడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ మాత్రం వెంటనే […]

KA Paul Iran Israel War: ప్రపంచవ్యాప్తంగా అశాంతి వాతావరణం నెలకొంది. పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇప్పుడే కాదు ప్రపంచంలో ఎప్పుడూ యుద్ధాలు జరుగుతున్నా.. ఐక్యరాజ్యసమితి తో పాటు ప్రపంచ శాంతి సంస్థలు మౌనంగానే ఉంటున్నాయి. పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. యుద్ధాన్ని నిలిపివేసే చర్యలు లేవు. చర్చలతో శాంతి అనేది అసాధ్యం అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ మన తెలుగు వాడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ మాత్రం వెంటనే చొరవ తీసుకొని ఆయా దేశాల అధినేతలు, ప్రతినిధులతో మాట్లాడుతూ యుద్ధ నివారణ చర్యలు చేపడుతుంటారు. కానీ ఆయన మాటలు కామెడీగా తీసుకుంటారు. ఎక్కువగా సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు మాదిరిగా వైరల్ చేస్తుంటారు. కానీ తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో కే ఏ పాల్ చూపిన చొరవ.. ప్రపంచ దేశాల అధినేతలకు కనువిప్పు కావాల్సిందే.

Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?

* ప్రపంచ దేశాలపై ప్రభావం..
గత కొద్ది రోజులుగా ఇరాన్( Iran), ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం అయితే ప్రారంభించారు కానీ వెనక్కి తగ్గేందుకు ఉన్న మార్గాలు ఆయా దేశాలకు దొరకడం లేదు. ఇందులో అగ్రరాజ్యం ఆధిపత్యం పెరగడంతో ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఒక రకమైన అశాంతి వాతావరణం నెలకొంటోంది. అయితే ఆయా దేశాల అధినేతలతో మాట్లాడుతున్నానని.. వారం పది రోజుల్లో యుద్ధం నిలిచిపోనుందని కేఏ పాల్ ప్రకటించారు. దానిని చాలా కామెడీ కోణంలో చూశారు అంతా. కానీ కె ఏ పాల్ ఇరాన్ అధినేత ప్రతినిధితో ఢిల్లీలో సమావేశం అయ్యారు. యుద్ధం నిలిచిపోవడానికి అవసరమైన సూచనలు చేశారు. ఆ ప్రతినిధి సైతం కే ఏ పాల్ చర్యలను అభినందించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో రాకుంటే కేఏ పాల్ చెప్పింది ఏదో అబద్ధం అన్నట్టు.. ఆయనేదో ఫన్ చేస్తున్నట్టు అనిపించేది.

* వారు చేయలేని పని..
ప్రపంచంలో( world wide ) చాలా పెద్ద దేశాలు ఉన్నాయి. ఎంతో బలమైన అధినేతలు ఉన్నారు. కానీ ఎవరూ చేయని సాహసం కేఏ పాల్ చేశారు. కానీ ఆయన ఆహార్యం, మాటలతో ఆయనను కామెడీ పీస్ చేశారు. కానీ ప్రస్తుత అశాంతి వాతావరణం లో ఆయన చేసిన ప్రయత్నం మాత్రం నిజంగా అభినందనీయం. తాను యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని కేఏ పాల్ చెబుతుంటే ఎవరికీ నమ్మశక్యం కావడం లేదు. ఇరాన్ అధినేత ప్రతినిధితో మాట్లాడారు అంటే కేఏ పాల్ ఎంతో కొంత ప్రయత్నం చేసి ఉంటారు కదా. ఆయన చెప్పిన మాటలు నిజమే కదా. బహుశా ఇజ్రాయిల్, ఇరాన్ అధినేతలతో మాట్లాడే శక్తి యుక్తి ఆయనకు ఉంది. ప్రపంచ దేశాలతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి కామెడీ అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. తాజాగా ఇరాన్ ప్రతినిధితో కేఏ పాల్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు చేయలేని పని కే ఏ పాల్ చేయడాన్ని ఆహ్వానిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper