Pawan Kalyan: విపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ఉండేవారు.ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు.అయితే అదే స్థాయిలో ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యేవారు.2024 ఎన్నికల వరకు జనసేనకు సరైన విజయం దక్కలేదు. పవన్ కళ్యాణ్ ను ప్రజలు గుర్తించలేదు. దీంతో ఆయన విషయంలో అమానుషంగా వ్యవహరించారు. వైసిపి నేతలు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేసేవారు. ప్రధానంగా వైసిపి ఫైర్ బ్రాండ్లుగా ఉండే నేతలు ఎక్కువగా మాట్లాడేవారు.కానీ కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు.పవన్ కళ్యాణ్ ను చాలా చులకనగా మాట్లాడేవారు. చివరకు జనసేన శ్రేణులపై సైతం దాడులకు తెగబడేవారు. అప్పటి వీర మహిళలపై సైతం దాష్టికాలకు దిగేవారు. అందుకే పవన్ ద్వారంపూడి విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి తెర వెనుక జరిగిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం తరలింపు వెనుక ఇప్పటికీ ద్వారంపూడి ఉన్నారన్న విషయాన్ని గుర్తించారు. అందుకే నేరుగా పోర్టుకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. అయితే ఇంత జరుగుతున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
* వరుసగా షాక్ లు
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వరుసగా షాక్ లు తగులుతున్నాయి.ఆయనకు చెందిన ఫ్యాక్టరీలు ఒక్కొక్కటి మూతపడుతున్నాయి.కరపలో ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కు చెందిన రొయ్యల ఫ్యాక్టరీని ఆగస్టు 6న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసేసింది. తాజాగా లంపక లోవ లో ఉన్న మరో ఫ్యాక్టరీని సైతం మూసివేశారు. దీంతో ద్వారంపూడికి భారీ షాక్ తగిలినట్లు అయింది. కాకినాడలో జనసైనికులను వెంటాడారు ద్వారంపూడి. ఈ క్రమంలో పవన్ ను సైతం టార్గెట్ చేసుకున్నారు. అందుకే వారాహి యాత్రలో పవన్ శపథం చేశారు. మీ అక్రమాలను వెలికి తీసి నడిరోడ్డు పై నిలబెట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అయితే అప్పట్లో దీనిని ద్వారంపూడి లైట్ తీసుకున్నారు. ముందు నువ్వు గెలిచి చూపించు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.కానీ ఎన్నికల్లో గెలిచారు పవన్.ఇప్పుడు ద్వారంపూడి కి చుక్కలు చూపిస్తున్నారు.
* పవన్ భారీ వ్యూహం
అయితే జనసేనకు పౌర సరఫరాల శాఖను కేటాయించడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.తన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను ఇప్పించుకున్నారు.ఎప్పటికప్పుడు మంత్రి నాదెండ్ల కాకినాడ పోర్టును తనిఖీ చేసేవారు.అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకునేవారు.సరిగ్గా 35 వేల టన్నులతో బయలుదేరిన విదేశీ షిప్ ను గుర్తించగలిగారు.కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీని అక్కడకు పంపించగలిగారు.పవన్ స్వయంగా రంగంలోకి దిగి రేషన్ దందాను బయట ప్రపంచానికి తెలియజేయగలిగారు.ఈ మొత్తం వ్యవహారం వెనుక పవన్ స్కెచ్ ఉంది. కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తన శపధాన్ని తెలియజేయాలన్న ప్రయత్నంలోనే పవన్ ఇదంతా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ద్వారంపూడి నోటి దూలకు ఇది మూల్యంగా భావించవచ్చు.