Pawan Kalyan:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన భార్య అన్నా లెజ్ నోవా స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోయారు. సంయుక్త ప్రకటన ద్వారా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వివరించారు. దాదాపు 12 సంవత్సరాల కాలం జీవితాన్ని పంచుకున్న వారు.. తన ప్రయాణాన్ని పరస్పర అవగాహనతో కొనసాగించారు. ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
వైవాహిక బంధం పూర్తయినప్పటికీ.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా కొనసాగుతామని పేర్కొన్నారు. తమ పిల్లల సంతోషం.. శ్రేయస్సు.. సంక్షేమం విషయంలో మొదటి ప్రాధాన్యం ఇస్తామని.. వారికోసం ఎప్పటికీ మంచి స్నేహితులుగా మిగిలిపోతామని పవన్, అన్నా వివరించారు. వ్యక్తిగత జీవితంలో మార్పులు సహజమని.. ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పుల విషయంలో మీడియా.. అభిమానులు.. శ్రేయోభిలాషులు తమ వ్యక్తిగత జీవితానికి గౌరవం కల్పించాలని కోరారు. ఇప్పటివరకు మా ప్రయాణంలో అండగా నిలిచిన వారికి.. ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సంయుక్తంగా వారిద్దరు ఈ ప్రకటన చేశారు.
పవన్ కళ్యాణ్ అన్నా దంపతులకు కుమారుడు… కుమార్తె. తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త వివాహానికి దారి తీసింది. అప్పటికే పవన్ రేణు దేశాయ్ తో వైవాహిక బంధం లో ఉన్నారు. ఆమెకు ఒక కుమారుడు.. కుమార్తె.. రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత అన్నా ను వివాహం చేసుకున్నారు… ఆ తర్వాత ఆమెతో ఇప్పటిదాకా వైవాహిక జీవితాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగించారు.. ఇటీవల పవన్ డిప్యూటీ సీఎం కావడంతో అన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెగా కుటుంబంలో జరిగే ప్రతి వేడుకలో ఆమె పాల్గొన్నారు. ఇటీవల సాయి ధరంతేజ్ ఎంగేజ్మెంట్ లో పవన్, అన్నా లెజ్ నోవా కనిపించలేదు. అకస్మాత్తుగా ఈ విడాకుల వ్యవహారం తెరమీదకి రావడంతో జనసేన నాయకులు. . పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.పవన్, అన్నా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇదంతా ఎందుకు జరిగింది.. అనే విషయాలను జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ తీసుకున్న నిర్ణయాన్ని వారు ఆమోదిస్తున్నారు. అది ఆయన వ్యక్తిగత జీవితం అని.. వ్యక్తిగత జీవితం ఇతరులు మాట్లాడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. అయితే కాలం గడిస్తే వారిద్దరి విడాకుల వెనుక ఏం జరిగిందనేది తెలుస్తుందని విశ్లేషకులు ఈ సందర్భంగా చెబుతున్నారు.