spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan Tweet on PM Modi: సీఈసీ అభిశంసనపై అలా.. ప్రధానిపై ఇలా.. ఏంటిది జగన్?!

Jagan Tweet on PM Modi: సీఈసీ అభిశంసనపై అలా.. ప్రధానిపై ఇలా.. ఏంటిది జగన్?!

Jagan Tweet on PM Modi: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయడం లేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రధాని మోదీ పై ప్రశంసలు కురిపిస్తూనే. తాజాగా ఆయన ప్రధానిగా పదవి చేపట్టి 8931 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏకంగా ఆయనను అభినందిస్తూ ట్విట్ చేశారు. పొలిటికల్ వర్గాలను ఇది ఆకర్షిస్తోంది. సాధారణంగా పుట్టినరోజు తో పాటు పర్వదినాల్లో మాత్రమే ప్రముఖులకు అభినందనలు వెల్లువెత్తుతాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి సందర్భం లేకపోయినా.. ప్రధాని నరేంద్ర మోడీని స్తుతించడం మాత్రం జాతీయస్థాయిలో చర్చ అయితే మాత్రం సాగుతోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై అభిసంశనకు విపక్షాలు మద్దతు కోరుతుంటే స్పందించని జగన్మోహన్ రెడ్డి.. కేంద్రం అడగకుండానే అన్ని అంశాలకు మద్దతు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

బిజెపి పెద్దలకు ప్రశంసలు..
ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. టిడిపి నేతృత్వంలోని కూటమిలో బిజెపితో పాటు జనసేన ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. టిడిపి తో జనసేన ను టార్గెట్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అవసరం అనుకుంటే రాష్ట్ర బిజెపి నేతలపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రజల విషయంలో మాత్రం పూర్తి వినయ విధేయతలతో నడుచుకుంటున్నారు. కేవలం రాజకీయ అవసరాలు కంటే.. వ్యక్తిగత వ్యవహారాల కోసమే జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని ఆ స్థాయిలో ఆకాశానికి ఎత్తివేయడంతో దేశంలో బిజెపి వ్యతిరేక వర్గాలు జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అడగకుండానే మద్దతు..
గత రెండేళ్లుగా భారతీయ జనతా పార్టీ ( Bhartiya Janata Party) అడగకుండానే కేంద్రానికి మద్దతు తెలుపుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. లోక్సభ స్పీకర్ ఎంపిక సమయంలోను అలానే చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ అలానే చేశారు. కేంద్రానికి పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే అవన్నీ ఒక ఎత్తు భారత ఎన్నికల కమిషనర్ పై అభిశంసన తీర్మానంపై కనీసం సంతకం పెట్టేందుకు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇదే ఎన్నికల నిర్వహణపై , ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఎక్కువగా మాట్లాడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జాతీయస్థాయిలో ఫిర్యాదుల పర్వం నడిపింది. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చినా పెద్దగా స్పందించడం లేదు. సందట్లో సడేమియా అన్నట్టు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పాలన పూర్తి చేసుకుంటే పొగడ్తల వర్షంతో అభినందనలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. అయితే జాతీయ స్థాయిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఖరి పై చర్చ అయితే మాత్రం సాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper