Hari Hara Veeramallu Movie advance bookings: వారం రోజుల క్రితం వరకు సోషల్ మీడియా లో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) గురించి నెగటివ్ న్యూస్ తప్ప, ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా పాజిటివ్ న్యూస్ తప్ప నెగిటివ్ న్యూస్ అసలు కనిపించడం లేదు. ఈ రేంజ్ లో అనూహ్యమైన మార్పు రావడానికి ముఖ్య కారణం,జులై 3 న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్. భారీ అంచనాల నడుమ విడుదలైన ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండే కాదు, ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు కూడా ‘హరి హర వీరమల్లు’ ని ట్రైలర్ విడుదలకు ముందు చాలా తక్కువ అంచనా వేసేవారు. ట్రైలర్ వచ్చిన తర్వాతనే వాళ్లకు కూడా అర్థమైంది, సినిమాలో చాలా పెద్ద మ్యాటర్ ఉందని. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న రాత్రి నుండి మొదలు పెట్టారు.
నార్త్ అమెరికా లో జూన్ 11 న వెయ్యాలనుకున్న ప్రీమియర్ షోస్ కి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దీంతో సోషల్ మీడియా లో ఈ చిత్రం పై ట్రోల్స్ మామూలు రేంజ్ లో పడలేదు. ‘హరి హర వీరమల్లు’ బుకింగ్స్ అప్డేట్ బయటకి వస్తే అభిమానులు వణికిపోయేవారు, దురాభిమానుల పండగ చేసుకునే వారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ‘హరి హర వీరమల్లు’ అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికా కి సంబంధించి నిన్న రాత్రి నుండి మొదలు పెట్టారు. ఎవ్వరూ ఊహించని రీతిలో, నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. అభిమానులకు కూడా అసలు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. ఈ రేంజ్ బుకింగ్స్ ని అసలు ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 60 షోస్ కి సంబంధించిన బుకింగ్స్ ని మాత్రమే మొదలు పెట్టారు.
Also Read: కీరవాణి ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో రాజమౌళి
ఈ 60 షోస్ నుండి దాదాపుగా 70 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క థియేటర్ ట్రెండ్ చివరి సారితో పోలిస్తే పది రెట్లు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఉదాహరణకు ఒక థియేటర్ లో పది రోజులకు 5 షోస్ కలిపి 89 టికెట్స్ ఒకప్పుడు బుక్ అయితే, నిన్నటి అడ్వాన్స్ బుకింగ్స్ లో కేవలం 30 నిమిషాల్లోనే 140 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారమైన ట్రెండ్ కాదు. అంతే కాకుండా చివరిసారి అసలు ట్రెండింగ్ లో లేని థియేటర్స్ లో కూడా ఇప్పుడు టిక్కెట్లు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. దీనిని బట్టీ ఈ సినిమాకు అద్భుతమైన ట్రెండ్ నడుస్తుంది అని చెప్పొచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే 3 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.