Dil Raju controversial comments: నిర్మాత దిల్ రాజు(Dil Raju) టైం ఈమధ్య కాలం లో అసలు బాగుండడం లేదు. ఒక చేత్తో ఆదాయం సంపాదిస్తుంటే, మరో చేత్తో ఆ ఆదాయాన్ని నష్టపోతున్నాడు. ఈ సంక్రాంతికి ఆయన నిర్మాణం లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్'(Game Changer) చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలితే, నాలుగు రోజుల గ్యాప్ లో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే రీసెంట్ గా విధాలైన ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం కమర్షియల్ గా మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ చిత్రానికి సుమారుగా 75 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశానంటూ దిల్ రాజు ప్రొమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కేవలం ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
నాన్ థియేట్రికల్ రైట్స్ లో కేవలం 30 కోట్లు మాత్రమే రీకవర్ అయ్యాయి. అది కూడా సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది కాబట్టి నెట్ ఫ్లిక్స్ రేట్స్ లో మార్పు రావొచ్చు. దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి వచ్చిన లాభాలు మొత్తం ఇక్కడ నష్టపోయినట్టు అయ్యింది. మొత్తానికి ఈ ఏడాది లో దిల్ రాజు మైనస్ లోనే ఉండిపోయాడు. ఇవి చాలవు అన్నట్టు, రీసెంట్ గా ఆయన వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటున్నాడు. ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫలితాన్ని పదే పదే గుర్తు చేస్తూ, రామ్ చరణ్ ఫ్యాన్స్ ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు దిల్ రాజు. వాళ్ళ నుండి తీవ్రమైన వ్యతిరేకత మరియు హెచ్చరికలు రావడం తో క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కాసేపు పక్కన పెడితే తమ్ముడు మూవీ ప్రొమోషన్స్ సమయంలో నిర్మాత దిల్ రాజు తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) ని తెలుగు హీరో తో పోలుస్తూ మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
Also Read: కీరవాణి ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో రాజమౌళి
ఆయన మాట్లాడుతూ ‘నేను విజయ్ తో తమిళం లో వారిసు అనే చిత్రం చేశాను. తెలుగు లో వారసుడు పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో విజయ్ గారు మాకు నెలకు 20 రోజుల డేట్స్ ఇచ్చేవాడు. ఆ సినిమాని పూర్తి చేయడానికి కేవలం నాకు 120 రోజుల సమయం మాత్రమే పట్టింది. ఇలా ప్రతీ స్టార్ హీరో పాటిస్తే బాగుంటుంది. ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోలు. ప్రతీ స్టార్ హీరో ఆరు నెలల్లో డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారో ముందే చెప్పేస్తే, ఆ సమయం లోనే షూటింగ్ ని పూర్తి చేయడానికి మేమంతా ఒత్తిడి తీసుకోగలం. సమయానికి సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి నిర్మాత, దర్శకుడు మరియు ప్రతీ టెక్నీషియన్ కష్టపడతాడు. కానీ ఈ విధానం మన టాలీవుడ్ లో పూర్తిగా కనుమరుగు అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు.