CM Surprise Visits: చంద్రబాబు( CM Chandrababu) వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లి సామాన్యుడి కష్టాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతి నెల అందించే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏదో ఒక జిల్లాను ఎంపిక చేసుకుంటున్నారు. ఆ సమయంలో సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని కలుస్తున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమానికి మంచి మార్కులు పడుతున్నాయి. మొన్న ఆ మధ్యన రాజమండ్రిలో ఓ దుకాణానికి నేరుగా వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. అటు తరువాత చెప్పులు కుట్టే చర్మ కార్మికుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఆనందం నింపారు.
Also Read: జగన్ పై రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు
ప్రజల్లో ఉండేలా ప్లాన్..
ఈసారి అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు చంద్రబాబు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లికు పరిమితం అయ్యారన్న విమర్శలు ఉండేవి. చివరి రెండేళ్లు మాత్రమే ఆయన ప్రజల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు అలా కాదు. అయితే ఇక్కడే చంద్రబాబు మరో ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఎక్కడా ప్రజలను ఇబ్బంది కలిగించకుండా.. తన పర్యటనలు ఉండేలా చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఆ సమయంలో సైతం వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలను, కొందరు సామాన్యులను కలుస్తున్నారు. ఆ ప్రయత్నం వర్కౌట్ అవుతోంది. పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు ఎలా అనేది తెలుసుకునే అవకాశం దక్కుతోంది. దానిని బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.
— N Chandrababu Naidu (@ncbn) July 1, 2025
అప్పట్లో వినూత్న కార్యక్రమాలతో..1995లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. అయితే నాలుగేళ్ల పాటు వినూత్నంగా పాలన చేశారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో చంద్రబాబు పట్ల ప్రత్యర్ధులు వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ వాటిని తట్టుకొని నిలబడాలంటే చంద్రబాబు ముందున్న కర్తవ్యం ప్రజలతో మమేకమై పనిచేయడం. చంద్రబాబు చేసింది అదే జన్మభూమి( Janmabhoomi), శ్రమదానం అన్న నినాదంతో ముందుకు సాగారు. అంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల మధ్యకు వచ్చి పాలన చేసింది లేదు. దానిని చేసి చూపించారు చంద్రబాబు. దీంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. 1999లో రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు అదే ప్రధాన కారణంగా నిలిచింది.
Also Read: ఆ వైసీపీ నేత ఫుల్ సైలెన్స్.. తేల్చుకోలేకపోతున్న జగన్!
ప్రజల్లో సంతృప్తి..
కూటమి ప్రభుత్వం( Alliance government) పట్ల సానుకూలత ఏర్పడడానికి ప్రధాన కారణం సిఎం చంద్రబాబు. ఆయన పనితీరుపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. అంతటి వయసులో కూడా కష్టపడుతున్నారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో చంద్రబాబు కష్టపడే తీరు కనిపిస్తోంది. ముఖ్యంగా సామాన్యులను కలిసేటప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే సానుకూలతలతోనే చంద్రబాబు పాలనా వ్యవహారాలు, ప్రజలతో మమేకమైన తీరు నడుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం చంద్రబాబుకు మరోసారి రాజకీయంగా ఎదురు ఉండదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.