Nara Lokesh : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా వ్యవహరించిన నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బయట పెట్టే పని చేస్తోంది తెలుగుదేశం కూటమి.
Also Read : తెలంగాణకు హైదరాబాద్ ఉంటే..మా ఆంధ్ర ప్రదేశ్ కి చంద్రబాబు ఉన్నాడు అంటూ నేషనల్ మీడియాలో లోకేష్ కామెంట్స్!
* వాడీ వేడి చర్చ
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు( assembly sessions ) జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు హాజరు కావడం లేదు. శాసనమండలిలో సత్తా చాటుతోంది. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ప్రజా సమస్యలతో పాటు కూటమి 10 నెలల పాలన పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదే క్రమంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ ప్రసంగం ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ లోకేష్ కీలక కామెంట్స్ చేశారు.
* అంతా ప్రచార ఆర్భాటమే
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక కిట్లు అందించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాగ్ తో పాటు పిల్లలకు అందించిన బెల్టులు, పుస్తకాలు, చివరికి బుక్ లెట్లపై జగన్ ఫోటో ఉండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు లోకేష్. దీనికి తోడు భారీ పాంప్లెట్లో జగన్ ఫోటో ఉండడాన్ని కూడా ప్రస్తావించారు. విద్యార్థులకు ఇచ్చిన కిట్లకు ఖర్చు కంటే.. ప్రచారానికి జరిగిన ఖర్చు ఎక్కువ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక కిట్లు.. ఇలా ప్రతి పథకంలో దోపిడీకి దిగారని ఆరోపణలు చేశారు. ప్రచార ఆర్భాటంతో గత ఐదేళ్లు గడిపేసారని.. బొమ్మల పిచ్చితో అదనంగా ఖర్చు చేశారని.. నిధులు దుర్వినియోగం చేశారని సంచలన ఆరోపణలు చేశారు లోకేష్. ఇప్పుడు అవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : నా భార్య బ్రాహ్మణి నుంచి అది నేను నేర్చుకోవాలి.. నారా లోకేష్
వాడూ వాడి రంగుల పి*చ్చి… బాబోయ్ pic.twitter.com/J35UXht6dC
— మన ప్రకాశం (@mana_Prakasam) March 11, 2025