Heroes : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…యంగ్ హీరోలు సైతం స్టార్ హీరోలుగా మారడానికి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిన మన స్టార్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ హీరోలను సైతం డామినేట్ చేస్తూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రి బ్రేక్ చేసే హీరో మరెవరు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహమైతే లేదు. ప్రస్తుతం మన హీరోలు సాధిస్తున్న విజయాలు వాళ్ళను భారీగా ఎలివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తమకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న మన స్టార్ హీరోలు సైతం బాలీవుడ్ హీరోలను బీట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక బాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఖాన్ త్రయం హవా నడుస్తోంది. ముఖ్యంగా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో అమీర్ ఖాన్ (Ameer khan) చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also Read : అమీర్ ఖాన్ రికార్డ్ ను కొట్టడం తెలుగు స్టార్ హీరోల వల్ల కావడం లేడా..?
ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ లో షారుక్ ఖాన్ (Sharukh Khan), సల్మాన్ ఖాన్ (Salman khan) లాంటి హీరోలు వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగారు. కానీ ఇప్పుడు ఖాన్ త్రయం హవా తగ్గిపోయిందనే చెప్పాలి. మరి వాళ్ళలా పాన్ ఇండియాను శాసించే ముగ్గురు హీరోలు ఎవరు అనే దానిమీద ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ఇక అందులో ఎక్కువగా వినిపించే పేర్లలో ప్రభాస్(Prabhas), రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) ల పేర్లు ప్రథమంగా ఉన్నాయి.
వీళ్ళు ముగ్గురు ఖాన్ త్రయం లాగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి దీన్ని బాలీవుడ్ హీరోలు కొంతవరకు జీర్ణించుకోలేకపోతున్నప్పటికి జరిగే వాస్తవం మాత్రం ఇదే అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం. ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇక మీదట నుంచి ఈ ముగ్గురు హీరోల నుంచి వచ్చే సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయి.
ఖాన్ త్రయం లను సైతం బీట్ చేస్తూ వీళ్ళు తమ స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి మన వాళ్ళు అనుకుంటున్నాట్టుగానే బాలీవుడ్ హీరోలకు చెక్ పెడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : పఠాన్ కోసం ఆ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డ షారుక్ ఖాన్