Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: నిమ్మరసానికి రూ.28 లక్షలా.. గుడివాడలో గడ్డం గ్యాంగ్ పై లోకేష్ పంచ్

Nara Lokesh: నిమ్మరసానికి రూ.28 లక్షలా.. గుడివాడలో గడ్డం గ్యాంగ్ పై లోకేష్ పంచ్

Nara Lokesh: ఏపీలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులవుతోంది. గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు బయటపడుతున్నాయి. ఒకరోజు శాసనమండలి సమావేశంలో టీ, స్నాక్స్ ఖర్చులు లక్షలాది రూపాయలు చూపగా.. ఇప్పుడు నిమ్మకాయ రసం కోసం ఏకంగా 28 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడం విశేషం. అది కూడా నీతికి, నిజాయితీకి నిలువుటద్దం అని చెప్పుకునే వైసిపి ఫైర్ బ్రాండ్ కొడాలి నాని అడ్డాలోనే ఈ నిమ్మరసం కుంభకోణం వెలుగు చూడడం విశేషం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ప్రకటనప్రకంపనలు సృష్టిస్తోంది.

వైసిపి ప్రభుత్వం టిట్కో గృహాల ప్రారంభోత్సవాన్ని గుడివాడ వేదికగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ వేడుకల్లో భాగంగాప్రజలకు నిమ్మరసం అందించారు. వేలాదిమందికి నాడు సమీకరించారు. సభను సక్సెస్ చేయాలని చూశారు. అయితే ఈ సభకు ప్రజాధనాన్ని విరివిగా వాడుకున్నారు. అయితే నాటి కార్యక్రమంలో కేవలం ప్రజలకు నిమ్మరసం అందించేందుకు 28 లక్షల రూపాయలు ఖర్చు చేశామని చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని బయటపెట్టారు మంత్రి లోకేష్. జగన్ సర్కార్ దోపిడికి హద్దు లేదా అంటూ ప్రశ్నించారు. ప్రజాధనాన్ని పందికొక్కుల మెక్కడానికి సిగ్గు లేదా అంటూ నిలదీశారు. జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లకు 28 లక్షలు దిగమింగేసావు అంటూ జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. గడ్డం గ్యాంగ్ అంటూ కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కో టిట్కో ఇల్లుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు దండుకున్నారని కూడా మంత్రి లోకేష్ విమర్శించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షల రూపాయలు బిల్లులు చేసుకోవడానికి సిద్ధపడ్డారని కూడా కొడాలి నాని గ్యాంగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు లోకేష్.

టిడిపి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెలరోజులు కూడా గడవలేదు. కానీ జగన్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తున్నాయి. ఈ విషయంలో టిడిపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఒకవైపు అవినీతి నేతల అరెస్టులు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంస ఘటనలకు సంబంధించి కేసులు బయటకు లాగుతున్నారు. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇంకోవైపు అణువణువునా పరిశీలించి వైసీపీ నేతల అవినీతిని బయటకు తీస్తున్నారు. అందులో భాగంగా గుడివాడలో టిట్కో గృహాల ప్రారంభమంటూ రాష్ట్రస్థాయిలో ఒక వేడుకను జరిపింది వైసిపి ప్రభుత్వం. అందులో జరిపిన అవినీతి, ఖర్చుల రూపంలో జరిగిన పక్కదారిని బయటకు తీసే పనిలో పడింది. ఏకంగా నిమ్మరసం కోసం 28 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డు బయటపడింది. దీంతో అది టిడిపి సర్కార్కు ప్రచారస్త్రంగా మారింది. ముఖ్యంగా గుడివాడను అడ్డగా చేసుకొని కొడాలి నాని ఏ తరహాలో దోపిడీకి తెర తీశారో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు లోకేష్. ప్రస్తుతం అదే వైరల్ అంశంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version