Nandamuri Family: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో తెలుగు తెరమీద చెరగని ముద్ర వేశాడు. ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి గొప్ప వ్యక్తి సినిమా నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయడం సీఎంగా మారి పేదలకు అండగా నిలవడం అనేది ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం… ఆయనకు ఇటు సినిమా రంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ తన మార్కును చూపించాడు. అందుకే ఈ రెండు రంగాల్లో అతను ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరు ఇప్పుడు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు…
ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్న హీరో ఎవరు అంటూ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబుకి అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా సినిమాలను చేస్తూ బాగా డబ్బులను సంపాదించాడు.
అలాగే బిజినెస్ లను సైతం చేస్తూ వాటిలో లాభాలను గడించాడు. అందువల్లే అతను దాదాపు 5000 కోట్ల వరకు ఆస్తిని కలిగి ఉన్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం చెరో 3000 కోట్ల వరకు ఆస్తులను కలిగి ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీలో ఈ ముగ్గురు హీరోలు మాత్రమే ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్నారు. మిగతా వారెవ్వరు పెద్దగా రాణించలేకపోయారు.
ఇక చైతన్యకృష్ణ లాంటి నటుడు ఒకటి రెండు సినిమాలను చేసినప్పటికి ఆయన నటనలో పరిణితి లేదని ప్రేక్షకులు అతన్ని రిజెక్ట్ చేశారు. తారకరత్న సైతం మంచి హీరోగా పేరు సంపాదించుకున్నప్పటికి అతని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తన సినిమా కెరియర్ అనేది ముగిసిపోయింది… ఇక ప్రస్తుతం బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇంకా గొప్ప సినిమాలు వస్తె చూడటానికి ప్రేక్షకులు రెడీ గా ఉన్నారు…