Homeఎంటర్టైన్మెంట్NTR Kalyan Ram Bonding: ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ మధ్య బాండింగ్ పెరగటానికి కారణం...

NTR Kalyan Ram Bonding: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ మధ్య బాండింగ్ పెరగటానికి కారణం ఇదే…

NTR Kalyan Ram Bonding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు, నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు… కెరియర్ మొదట్లో నందమూరి ఫ్యామిలీ నుంచి తనకు పెద్దగా సపోర్ట్ అయితే లభించలేదు. అయినప్పటికి ఇతను సోలోగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ […]

NTR Kalyan Ram Bonding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు, నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు… కెరియర్ మొదట్లో నందమూరి ఫ్యామిలీ నుంచి తనకు పెద్దగా సపోర్ట్ అయితే లభించలేదు. అయినప్పటికి ఇతను సోలోగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పోయారు. వీళ్ళిద్దరూ ఎక్కడ చూసినా కూడా కలిసి కనిపిస్తున్నారు. అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సందడి చేస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటుకుంటున్న క్రమంలో కళ్యాణ్ రామ్ మాత్రం హీరోగా చేస్తూనే ప్రొడ్యూసర్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ కుదరడానికి గల కారణం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: బైకర్.. రేసింగ్ లు నచ్చేవారికి ఓకే

నిజానికి కళ్యాణ్ రామ్ కెరియర్ మొదట్లో ఎన్టీఆర్ ను పట్టించుకోలేదు. అయిన కూడా ఎన్టీఆర్ తన బాటలో తను నడుస్తూ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో తను విపరీతంగా డబ్బులు నష్టపోయాడు. అది తెలుసుకున్న ఎన్టీఆర్ తన సినిమాలకు ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని కళ్యాణ్ రామ్ కి ఇచ్చాడు.

దాంతో కళ్యాణ్ రామ్ మరోసారి లాభాల బాట పట్టాడు. మొత్తానికైతే అలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది బాగా సెట్ అయింది. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసిపోయి మరో కొన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరు బాలయ్య బాబుతో మాట్లాడకపోవడం నందమూరి ఫ్యామిలీ అభిమానులను కొంతవరకు ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి…

మొత్తానికైతే బాలయ్య, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సైతం కలిసిపోయి వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చాలామంది నందమూరి అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper