https://oktelugu.com/

Manchu Manoj: ఫ్లాష్..ఫ్లాష్.. మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ.. చేరేది ఆ పార్టీలోనే

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం. మోహన్ బాబు ఇంట్లో తలెత్తిన వివాదానికి ముగింపు పలికారు. ఈ తరుణంలో మంచు మనోజ్ ఈరోజు సంచలన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 16, 2024 / 10:04 AM IST

    Manchu Manoj(4)

    Follow us on

    Manchu Manoj: మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? భార్య మౌనికతో కలిసి రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారా? ఈరోజు రాజకీయ ప్రకటన చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రితో కుమారుడు మనోజ్ విభేదించడం. మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి. ఆసుపత్రిలో చేరిక.. ఇలా కొద్ది రోజులు పాటు సీరియల్ ఎపిసోడ్ నడిచింది. అల్లు అర్జున్ వివాదం తెరపైకి రావడంతో.. మంచు కుటుంబం వివాదం తెర వెనుకకు వెళ్ళింది. ఇప్పుడు మంచు మనోజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మోహన్ బాబుతో పాటు విష్ణు ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. మంచు మనోజ్, మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీ పై కీలక ప్రకటన చేస్తారని సమాచారం. అది కూడా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సోమవారం పొలిటికల్ ఎంట్రీ పై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా బలపడితేనే భవిష్యత్తు అని మంచు మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డి. వారి అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పెద్ద కుమార్తె అఖిలప్రియ. అక్కకు చేదోడు వాదోడుగా మౌనిక ఉండేవారు. మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఆమె వివాహంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

    * టిడిపిలో సుదీర్ఘకాలం
    అటు మోహన్ బాబు కుటుంబం సైతం రాజకీయాలతో మంచి సంబంధాలే ఉండేవి. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మోహన్ బాబు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవి చేపట్టారు. ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉండేవి. తరువాత చంద్రబాబు నాయకత్వంలో కొద్దిరోజుల పాటు పనిచేసిన మోహన్ బాబు.. ఆయనతో విభేదించి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసిపి కి దగ్గరయ్యారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేయలేదు. చంద్రబాబుకు దగ్గరయ్యేలా కనిపించారు. కానీ స్తబ్దుగా ఉండిపోయారు.

    * పవన్ తో సన్నిహిత సంబంధాలు
    అయితే అటు మౌనిక వైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడం.. ఇటు తండ్రి మోహన్ బాబు రాజకీయాల్లో రాణించడంతో.. తాను సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మనోజ్ భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లోనే మనోజ్ పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. ఆయనకు పవన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే జనసేనలో చేరడానికి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సోమవారం హైదరాబాదు నుంచి ప్రత్యేక కార్ల ర్యాలీగా మనోజ్ దంపతులు ఆళ్లగడ్డ చేరుకోనున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న కుటుంబ అభిమానులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరి సమక్షంలో తమ రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం. మంచి ముహూర్తం చూసుకొని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ ఉన్నారు. తన చెల్లెలు తో పాటు ఆమె భర్త పొలిటికల్ ఎంట్రీ పై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.