Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రానికి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 620 కోట్ల రూపాయలకు జరిగింది. నిన్నటితో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకుంది. అయితే కేవలం రెండు ప్రాంతాల్లో తప్ప, మిగిలిన అన్ని చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. ఆ రెండు ప్రాంతాల్లో కూడా బిజినెస్ హద్దులు దాటి చేయకుండా ఉండుంటే బాగుండేది. హిందీ వెర్షన్ వసూళ్ళలో ఇప్పటికే జోరు తగ్గలేదు. తెలుగు వెర్షన్ వసూళ్లు కూడా అంతే. కానీ తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్స్ లో మాత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే. మలయాళం వర్షన్ తప్ప, మిగిలిన భాషల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. మలయాళం వెర్షన్ విడుదలకు ముందు 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది.
అల్లు అర్జున్ కి దశాబ్దాల నుండి కేరళలో విపరీతమైన క్రేజ్ ఉండడం, ఆయన సినిమాలు అక్కడ భారీ వసూళ్లను సాధించిన హిస్టరీ ని పరిగణలోకి తీసుకొని అంత రేట్ కి కొనుగోలు చేసారు అక్కడి బయ్యర్స్. కానీ ఈ సినిమాకి ఇప్పటి వరకు కేవలం 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. అంతకు మించి ముందుకు వెళ్లడం అనేది అసాధ్యమని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంటే దాదాపుగా 13 కోట్ల రూపాయిల నష్టాన్ని ఈ చిత్రం చూసింది అన్నమాట. ఇది ఫ్లాప్ అని అనడానికి కూడా లేదు, డిజాస్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే విడుదలకు ముందు వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుందట ఈ చిత్రం. 11 రోజులకు బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. కానీ నార్త్ అమెరికా లో మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ప్రస్తుతానికి కష్టమే అని అంటున్నారు.
కారణం నార్త్ అమెరికా లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 24 మిలియన్ డాలర్లకు జరిగిందట. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి 13 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. తెలుగు వెర్షన్ వసూళ్లు నిన్నటితో క్లోజింగ్ పడినట్టే. కేవలం హిందీ వెర్షన్ వసూళ్లు మాత్రమే ఇంకా వస్తున్నాయి. అది కూడా కేవలం డిసెంబర్ 20 వ తారీఖు వరకు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత హాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం విడుదల కాబోతుంది. షోస్ అన్ని ఆ చిత్రానికే వెళ్లబోతుంది. పుష్ప 2 ఇక మహా అయితే మరో మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టగలదట. కాబట్టి ఇక్కడ కూడా ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. అలా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా, ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం ఫ్లాప్ గా నిల్చింది.