https://oktelugu.com/

Sumanth : చేజేతులారా కెరియర్ ను నాశనం చేసుకున్న హీరోలు వీళ్లేనా..?

సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి అనుగుణమైన కష్టాన్ని పడటానికి ఎవ్వరూ ఇష్టపడరు.

Written By:
  • Gopi
  • , Updated On : December 16, 2024 / 10:01 AM IST

    sumanth

    Follow us on

    Sumanth : సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి అనుగుణమైన కష్టాన్ని పడటానికి ఎవ్వరూ ఇష్టపడరు. తేలిగ్గా సక్సెస్ వస్తే అనుభవించాలనుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నిజానికి ఇండస్ట్రీలో కష్టపడిన వాళ్లకు మాత్రమే సక్సెస్ దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ విపరీతంగా కష్టపడి వాళ్లకు వాళ్లు ఆ స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న వాళ్లే కావడం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చి మంచి విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక కొంతమంది హీరోలు మాత్రం వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా వాళ్లకు అనుకున్న సక్సెస్ లైతే దక్కడం లేదు. కారణం ఏదైనా కూడా వాళ్ళు ఇండస్ట్రీలో అనుకున్న మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో పాటుగా వాళ్ల కంటు ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకోకపోవడం వాళ్ళకి భారీ గా మైనస్ గా మారింది…ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చిన, ఓన్ టాలెంట్ తో వచ్చినా కూడా ఇక్కడ తమకంటూ ఒక సపరేట్ స్టైల్ ను చూపిస్తూ ముందుకు సాగిన వాళ్ళు మాత్రమే ఎక్కువ రోజులు పాటు ఇండస్ట్రీలో కొనసాగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మోహన్ బాబు కొడుకులు అయిన మంచు విష్ణు, మంచు మనోజ్ లు మొదట భారీ సినిమాలను చేస్తూ హీరోలుగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికి వాళ్లకు పెద్దగా సక్సెస్ లైతే దక్కలేదు. దాంతో ఎంత తొందరగా ఇండస్ట్రీకి వచ్చారో అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నారనే చెప్పాలి… ఇక నందమూరి స్టార్ హీరో అయిన తారకరత్న కూడా మొదట్లో ఇండస్ట్రీకి వచ్చి సరైన సినిమాలు చేయలేక చతికిల పడిపోయాడు.

    ఇక అక్కినేని ఫ్యామిలీ హీరోలైన సుమంత్ సుశాంత్ లు కూడా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి వాళ్ళు స్టార్ హీరో రేంజ్ ను మాత్రం టచ్ చేయలేకపోయారు. నిజానికి వీళ్ళందరూ మంచి సినిమాలను చేయడంలో ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళ కథల ఎంపికలో సరైన క్లారిటీ లేకపోవడం,

    ఆ సినిమా మీద వాళ్లకు ఒక అవగాహన రాకపోవడం, దర్శకుడు వాళ్లను చూపించే విధానంలో వేరియేషన్స్ ను కోరుకోకుండా ప్రతి సినిమాలో ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని పోషిస్తూ ముందుకు సాగడం వల్లే ఈ హీరోలు ఈరోజు ఇండస్ట్రీలో వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు. తద్వారా ప్రేక్షకులు కూడా వాళ్లను ఓన్ చేసుకోలేకపోయారు. అందుకే వాళ్లకు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులు వాళ్ళ సినిమాలను చూదాటానికి ఆసక్తి అయితే చూపించడం లేదు.

    కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతూ ఉంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ కథల విషయంలో చిన్న పొరపాటు జరిగిన కూడా హీరోల కెరియర్లు భారీగా డౌన్ ఫాల్ అయిపోతాయని చెప్పడానికి వీళ్ళను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు…