Homeఆంధ్రప్రదేశ్‌Minister Nara Lokesh : లోకేష్ మాటిస్తే అంతే.. గంటల్లో పని జరగాల్సిందే!

Minister Nara Lokesh : లోకేష్ మాటిస్తే అంతే.. గంటల్లో పని జరగాల్సిందే!

Minister Nara Lokesh : మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సమకాలీన అంశాలపై ఇట్టే స్పందిస్తుంటారు. ప్రభుత్వపరంగా ఏమైనా లోపాలు ఉంటే క్షమించాలని కోరుతుంటారు. వీలైనంత త్వరగా వాటికి పరిష్కార మార్గం చూపుతారు. గతంలో విదేశాల్లో ఇరుక్కుపోయిన వారిని ఇట్టే తీసుకొచ్చేవారు. అటువంటి బాధితులంతా లోకేష్ ను ఆశ్రయించడం ప్రారంభించారు. అయితే సమస్య ఏదైనా సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు తెలిసిన వెంటనే స్పందించే గుణం లోకేష్ ది. అయితే లోకేష్ జోక్యం చేసుకుంటే తప్పకుండా పరిష్కార మార్గం దొరుకుతుందన్న ఆశ ప్రజల్లో పెరుగుతోంది. దీంతో ఎక్కువ మంది ఆయనను ఆశ్రయిస్తున్నారు.

Also Read : విద్యార్థులు చదవట్లేదని.. హెచ్ఎం ఏం చేశారో తెలుసా? లోకేష్ స్ట్రాంగ్ రియాక్షన్!

* సత్రం తొలగింపు..
తాజాగా కడప( Kadapa district) జిల్లాలోని బద్వేలు నియోజకవర్గ పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం ఉంది. అక్కడ శ్రీ కాశి నాయన అన్నదాన సత్రం ఉండేది. ఆ సత్రం విషయంలో మంత్రి లోకేష్ స్పందన ఆకట్టుకుంటోంది. అటవీ భూముల్లో కొనసాగుతున్న ఆ సత్రాన్ని ఆ శాఖ అధికారులు తొలగించారు. నిబంధనల మేరకు అక్కడ తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అటవీ ప్రాంతంలో వేలాది మందికి అన్నదానం చేస్తున్న సత్రం అది. దానిని తొలగించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విషయం లోకేష్ వరకు వెళ్ళింది. అధికారుల చర్యకు తాను క్షమాపణ కోరడమే కాదు.. తన సొంత ఖర్చులతో తొలగించిన భవనాన్ని పునర్నిర్మిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

* రంగంలోకి లోకేష్ టీం
సాధారణంగా రాజకీయ పార్టీల( political parties) నేతలు ఇచ్చే హామీలు అమలు కావాలంటే కొద్ది సమయం పడుతుంది. కానీ లోకేష్ అలా కాదు. అలా మాటిచ్చారో లేదో గంటల వ్యవధిలోనే లోకేష్ టీం రంగంలోకి దిగింది. కాశీనాయన అన్నదాన సత్రం వద్దకు వచ్చి తొలగించిన భవనం పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టింది. లోకేష్ మాటిచ్చిన 24 గంటల్లోనే పనులు ప్రారంభం కావడంపై ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* 24 గంటల వ్యవధిలోనే..
అయితే ఈ ఘటన బుధవారం( Wednesday) వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు తెలిసింది. అధికారులు చేసిన తప్పిదానికి లోకేష్ క్షమాపణలు కూడా కోరారు. సొంత డబ్బులతో భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే తన టీమును బద్వేలు పంపించి సత్రం నిర్మాణానికి అవసరమైన యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. గురువారం తెల్లవారేసరికి భవన నిర్మాణానికి పునాదులు తవ్వకాలు ప్రారంభించారు. అందుకు సంబంధించి మార్కింగ్ చేశారు. సాయంత్రానికి పునాదుల తవ్వకాలు పూర్తి చేయాలని ప్రణాళిక పెట్టుకున్నారు. వీలైనంత త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. దీంతో లోకేష్ తీరు అభినందనలు అందుకుంటుంది.

Also Read : వ్యవసాయమా.. చంద్రబాబుకు సాయమా? విజయసాయి రెడ్డి పై వైసీపీ కౌంటర్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version