Mahesh Babu , Ranbir Kapoor
Mahesh Babu and Ranbir Kapoor : ఒకప్పుడు మల్టీ స్టార్రర్ ట్రెండ్ ఇండియా వైడ్ గా ఒక రేంజ్ లో ఉండేవి. స్టార్ హీరోలు ఎలాంటి బేధభావాలు లేకుండా సినిమాలు కలిసి నటించేవారు. కానీ ఆ తర్వాత జనరేషన్ వచ్చినప్పుడు మన టాలీవుడ్ లో మల్టీస్టార్రర్ ట్రెండ్ బాగా తగ్గిపోయింది కానీ, బాలీవుడ్ లో మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే వచ్చింది. మన టాలీవుడ్ లో మల్టీస్టార్రర్ ట్రెండ్ కి మళ్ళీ ఊపిరి పోసిన హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు(Super star Mahesh Babu), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh). వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ద్వారానే ఈ ట్రెండ్ మళ్ళీ ఊపు అందుకుంది. ఇప్పుడు ఏ రేంజ్ కి ఈ ట్రెండ్ వెళ్లిందంటే, నేటి తరం మాస్ హీరోలు పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి సూపర్ స్టార్స్ కలిసి నటించే రేంజ్ కి చేరుకుంది. భవిష్యత్తులో ఈ ట్రెండ్ చాలా కామన్ అయిపోతుంది.
Also Read : మహేష్ విషయంలో రాజమౌళిని మించిపోయిన త్రివిక్రమ్… ఎలా చూపిద్దామని డిసైడ్ అయ్యాడేంటీ!
అయితే గతం లో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir kapoor) కలిసి ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇద్దరు కూడా నటన పరంగా పీక్ రేంజ్ ని చూపిస్తున్న రోజులవి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు/ నిర్మాత కరణ్ జోహార్ ఈ క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రాన్ని నిర్మించేందుకు అమితాసక్తిని చూపించాడు. కానీ ఎందుకో మహేష్ బాబు కి మొదటి నుండి బాలీవుడ్ లో నటించాలనే ఆసక్తే లేదు. ఎంతో మంది దర్శకులు అప్పట్లో ఆయనతో సినిమాలు చేయాలని అనుకున్నారు కానీ, మహేష్ బాబు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. అప్పట్లో ఇంత పెద్ద మల్టీస్టార్రర్ ప్రతిపాదనని కూడా ఆయన రిజెక్ట్ చేసాడు. తనకు బాలీవుడ్ లో సోలో హీరోగానే ఎంట్రీ ఇవ్వాలని ఉందని, ఆ ఎంట్రీ కూడా రాజమౌళి సినిమాతోనే ఉంటుందని అప్పట్లోనే చెప్పాడట.
చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఆయన రాజమౌళి సినిమాతోనే బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. కానీ బంగారం లాంటి కాంబినేషన్ మిస్ అయ్యిందని, వీళ్లిద్దరి కలయిక లో సినిమా వచ్చునంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేదని, ఆరోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి ఉండేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ సమయానికి మహేష్ బాబు మన టాలీవుడ్ లో బిగ్ సూపర్ స్టార్, రణబీర్ కపూర్ అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న హీరో. కచ్చితంగా మహేష్ బాబు క్యారక్టర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కానీ ఇద్దరు మిల్క్ బాయ్స్ కలిసి వెండితెర మీద కనిపిస్తే ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉండేది. హైదరాబాద్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.
Also Read : మహేష్ కాకుండా కృష్ణ గారికి నేటి తరం స్టార్ హీరోలలో ఫేవరెట్ ఎవరో తెలుసా?