Vijaya Sai Reddy , Chandrababu
Vijaya Sai Reddy and Chandrababu : జగన్మోహన్ రెడ్డి పై( Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లోనే పెను దుమారానికి దారితీశాయి సాయి రెడ్డి మాటలు. జగన్మోహన్ రెడ్డి కోటరీని వదిలించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందంటూ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సంచలనం రేపుతున్నాయి. అధినేతకు సన్నిహిత నేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో చర్చకు దారితీస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరూ దీనిపై మాట్లాడడం లేదు. అయితే ఫస్ట్ రియాక్షన్ ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ మంత్రి ఒకరు విజయసాయిరెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు.
Also Read : పగోడికి(చంద్రబాబుకు) విషెస్.. నువ్వు మారిపోయావ్ విజయసాయి
* రాజకీయాలు వదిలేస్తానని చెప్పి..
కొద్ది రోజుల కిందట విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని.. రాజకీయాలు చేయనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. కానీ అటు తరువాత కూడా చాలాసార్లు రాజకీయాలు మాట్లాడారు. రాజకీయ నేతలను కలిశారు. ఇప్పుడు ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పై మాట్లాడారు. ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. దీంతో అసలు విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారా? లేదా? అన్నది చర్చకు దారితీస్తోంది. దీనిపైనే మాట్లాడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* కాకాని స్ట్రాంగ్ రియాక్షన్..
విజయసాయిరెడ్డి కామెంట్స్ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy ) స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి.. చంద్రబాబుకు సాయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయిరెడ్డి కదా అని గుర్తు చేశారు. ఆయనకు మించిన కోటరీ ఇంకెవరు ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే విజయసాయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సాయి రెడ్డిని మించిన కోటరి వ్యక్తి ఎవరూ లేరని.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ వద్దకు వెళ్తే లోపల సాయి రెడ్డి ఉన్నారని చెప్తే.. అప్పుడు తాము వెళ్లే వాళ్ళం కాదని.. మాట్లాడే వాళ్ళం కాదన్నారు. కోటరీలో వ్యక్తులు తనను లోపలికి రానివ్వడం లేదని సాయి రెడ్డి చెప్పడానికి తప్పు పట్టారు. జగన్ ఏమైనా అమాయకుడా అని ప్రశ్నించారు. సాయి రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వ్యవసాయం వదిలేసి.. చంద్రబాబుకు సాయం చేస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.
* రాజీనామా సమయంలో
అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి రాజీనామా ప్రకటించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తో పొలిటికల్ జర్నీ కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పినా పర్వాలేదు. కానీ బిజెపి అగ్రనేతలకు చెప్పడం ఏంటనేది తాజాగా తలెత్తుతున్న ప్రశ్న. తన రాజీనామాతో కూటమికి ప్రయోజనం చేకూరుతుందని అప్పట్లో చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తో పాటు పార్టీ శ్రేణులపై సైతం విమర్శలకు దిగుతున్నారు. దీంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read : ఏది జరిగినా 40 ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మహత్యం.. ఎంపీ విజయసాయి ‘ట్వట్ల’ దండకం…