Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh elevation in Sakshi media: సాక్షి లో లోకేశ్ కు ఎలివేషన్.. పాపం...

Nara Lokesh elevation in Sakshi media: సాక్షి లో లోకేశ్ కు ఎలివేషన్.. పాపం కొమ్మినేని.. తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది

Nara Lokesh elevation in Sakshi media: అదుర్స్ సినిమా చూశారా.. అందులో ఓ సన్నివేశంలో బ్రహ్మానందం బిల్డప్ ఇవ్వబోయి ఇరుకున పడతారు. ఆ సందర్భంలో బ్రహ్మానందం పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా రెస్పాండ్ అవుతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువుగారు అంటూ కౌంటర్ ఇస్తారు. దానికి బ్రహ్మానందం ముఖం వాడిపోయి కనిపిస్తుంది. ఈ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. సరిగ్గా ఇటువంటి సన్నివేశమే రిపీట్ అయింది. అది ఏ సినిమా. […]

Nara Lokesh elevation in Sakshi media: అదుర్స్ సినిమా చూశారా.. అందులో ఓ సన్నివేశంలో బ్రహ్మానందం బిల్డప్ ఇవ్వబోయి ఇరుకున పడతారు. ఆ సందర్భంలో బ్రహ్మానందం పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా రెస్పాండ్ అవుతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువుగారు అంటూ కౌంటర్ ఇస్తారు. దానికి బ్రహ్మానందం ముఖం వాడిపోయి కనిపిస్తుంది. ఈ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. సరిగ్గా ఇటువంటి సన్నివేశమే రిపీట్ అయింది. అది ఏ సినిమా. ఎవరు హీరో.. ఎక్కడ జరిగింది అని మాత్రం అడక్కండి. ఎందుకంటే ఈ కథనం చదివితే మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

సాక్షి టీవీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా నిత్యం నెగిటివ్ వార్తలు ప్రసారం అవుతూనే ఉంటాయి. కొమ్మినేని శ్రీనివాసరావు.. ఈశ్వర్.. ప్రతి వ్యాఖ్యత కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు. అఫ్కోర్స్ ప్రో టిడిపి చానల్స్ లో కూడా వ్యవహారం ఇదేవిధంగా ఉంటుంది. అవేం తక్కువ కాదు.. సాక్షి ఎక్కువ కాదు. కాకపోతే సాక్షిలో కొన్ని సందర్భాలలో తెలియక జరిగిన పొరపాట్లు తీవ్రమైన చర్చకు దారితీస్తుంటాయి. అటువంటి పొరపాటే ఒకటి జరిగింది. చివరికి అది లోకేష్ కు కేజీఎఫ్ లెవెల్ లో ఎలివేషన్ ఇచ్చింది.

ఇటీవల సాక్షిలో ఒక చర్చ వేదిక నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ చర్చ వేదికలో పాల్గొన్న ఒక ఎనలిస్ట్ ఓపెన్ గానే తన భావాలను వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీలో జరిగిన ఫుడ్ పాయిజన్ కేసులో లోకేష్ స్పందించారని.. సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారని.. ఇకపై అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని క్లారిటీ ఇచ్చారని.. తద్వారా లోకేష్ మెచ్యూరిటీ ఉన్న నాయకుడిగా వ్యవహరించారని ఆ ఎనలిస్ట్ చెప్పారు.

అతడు లోకేష్ గురించి మాట్లాడుతున్నంతసేపు కొమ్మినేని శ్రీనివాసరావు చూస్తూ ఉండిపోయారు. అతడి మాటలకు అడ్డు తగలడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వాస్తవానికి సాక్షి టీవీలో లోకేష్ కు ఎన్నడు కూడా పాజిటివ్ కంటెంట్ ప్రసారం కాదు. కానీ, కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా ఉండగా.. లైవ్ చర్చ నడుస్తుండగా.. లోకేష్ కు అనుకూలంగా ఒక వ్యక్తి మాట్లాడటం.. అది ప్రసారం కావడం నిజంగా ఆశ్చర్యకరం. బహుశా సాక్షి చరిత్రలో ఇటువంటి సంఘటన మరొకసారి రిపీట్ కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అసలు వాస్తవాన్ని సాక్షి బయట పెట్టడం పట్ల టిడిపి నేతలు సంబరపడుతున్నారు. ఇప్పటికైనా లోకేష్ స్టామినా తెలుసుకోవాలని వైసిపి నేతలకు ఈ వీడియో ద్వారా సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper