Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ సవాల్.. పట్టించుకోని జగన్!

Nara Lokesh: లోకేష్ సవాల్.. పట్టించుకోని జగన్!

Nara Lokesh: జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడిగా పార్టీ శ్రేణులు అభివర్ణిస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ హై కమాండ్ ను ఎదిరించి వైసీపీ ఏర్పాటు చేసి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకుంటాయి. ఆయన ఎదుట లోకేష్ నిలబడలేదని.. ఆ అర్హత కూడా లేదని తేల్చి చెబుతుంటాయి. అయితే మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అభిప్రాయంలో కొంత మార్పు వచ్చింది. లోకేష్ సైతం రాజకీయంగా పట్టు బిగించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయంగా రాటు తేలారు కూడా. అయితే లోకేష్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇప్పటికీ తక్కువ అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు అన్న అభిప్రాయం ఎక్కువగానే ఉంది. అయితే ఆ ఇద్దరు నేతల్లో ఎవరు బలవంతులు అంటే కచ్చితంగా జగన్ వైపే వారు మొగ్గు చూపుతారు.. కానీ ఇటీవల జగన్ వేస్తున్నా అడుగులు.. చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ వారిని కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. అప్పట్లో లోకేష్ ట్రోల్స్ చేసాం కానీ.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకుమించి అన్నట్టు ఉంది పరిస్థితి.

* క్లియర్ కట్ గా లోకేష్…
మరోవైపు లోకేష్ తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని భావిస్తే తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు లోకేష్. అయితే బలమైన నాయకుడిగా భావించే జగన్ ఈ సవాల్ ను ఇంతవరకు స్వీకరించలేదు. లోకేష్ కంటే బలవంతుడు జగన్ అనుకుంటే ఆ పార్టీ శ్రేణులు ఆయనను ఒప్పిస్తే బాగుంటుంది. డీఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసామని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. నియామకాల్లో అవకతవకలు జరిగాయి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా డీఎస్సీ పై ఆందోళనలు చేస్తుండగా రాష్ట్ర హైకోర్టు సైతం సరైన ఆధారాలు చూపించకపోవడంతో వైసీపీ నేతలు వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

* ఇదో మంచి అవకాశం..
ప్రజా సమస్యలు అంటేనే డీఎస్సీ అన్నట్టు పరిస్థితి ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. నీట్ ప్రస్తుత పత్రాల లీకేజీ వ్యవహారంలో జాతీయస్థాయిలో జరిగిన రచ్చ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఏపీలో సైతం డీఎస్సీ పై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పదేపదే డీఎస్సీ పై బురద జల్లుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో నిజాయితీ ఉంటే.. సమయం, వేదిక జగన్ ఇష్ట ప్రకారమే ఖరారు చేయాలని.. బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ప్రైవేటు వేదికపై కాకుండా ప్రజల ముందే నిజానిజాలు తేల్చుకుందామని.. అందుకు ముందుకు రావాలని కోరారు. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ స్పందన లేకుండా పోయింది. మంత్రి నారా లోకేష్ పారదర్శకతను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తన స్టాండ్ క్లియర్ గా చెప్పగా.. జగన్ మాత్రం స్పందించడం లేదు. దీనిని బట్టి అర్థం అవుతోంది జగన్ దుస్థితి.

Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular