Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి. మన వాదనను వినిపించాలి. మన వాదనలో ఉన్న సత్తాను న్యాయమూర్తికి అర్థమయ్యేలాగా వివరించాలి. అప్పుడు జరిగిన తప్పును బయట పెట్టాలి. తప్పు చేసిన వాడికి శిక్షపడేలా చేయాలి. అన్యాయానికి న్యాయం జరగకూడదు అనుకుంటే.. సమర్థులు ఇలానే చేస్తారు. కానీ మూర్ఖులే వితండవాదం చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఇటీవల డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. తమ ఉద్యోగ కలను సాకారం చేసుకున్నారు రేయి పగలు కష్టపడి చదివి మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ వ్యవహారంలో మొదటి నుంచి కూడా వైసిపి సూక్ష్మ పరిశీలన చేయడం మొదలు పెట్టింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధ్యం కాని పనిని.. చంద్రబాబు చేతి చూపించడం సహజంగానే వైసీపీకి నచ్చలేదు. ఇంకేముంది బురద చల్లడం మొదలుపెట్టింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని గొంతు సవరించడం ప్రారంభించింది. తన తోక పత్రిక సాక్షిలో అడ్డగోలుగా రాయడం షురూ చేసింది.

వాస్తవానికి ఆధారాలు పకడ్బందీగా ఉంటే.. డీఎస్సీలో అక్రమాలు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా బయట పెట్టాలి. న్యాయస్థానాలను ఆశ్రయించాలి. అలాకాకుండా తన సొంత పత్రికలో ఇష్టానుసారంగా రాయడం.. ధర్మేంద్ర రాజీనామా చేశారు కాబట్టి.. లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని కోరడం వితండవాదం అవుతుంది. పైగా సాక్షి ఇప్పటికే అనేక రకాలుగా కథనాలను రాసింది. అందులో వాస్తవం లేదు. నిండా సుష్కత్వం తప్ప. అయినప్పటికీ సాక్షి ఏదో దింపుడు కళ్ళం ఆశలాగా.. బురద కుమ్మరిస్తూనే ఉంది. అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉంది.

ఇప్పటికే డిఎస్సి విషయంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు.. ఏ ప్రకారం అర్హులను ఎంపిక చేసాము.. దానికోసం ఎటువంటి నిబంధనలు రూపొందించాము.. అర్హులు ఎటువంటి క్రీడలు ఆడారు.. అందులో వారు సాధించిన మెడల్స్.. అన్నింటినీ బయటపెట్టారు. అనుమానం ఉంటే కోర్టులకు కూడా వెళ్లవచ్చని సూచించారు. కానీ ఇంతవరకు వైసీపీ ఆ పని చేయలేదు. ఎంతసేపటికి బురద చల్లడమే అలవాటుగా పెట్టుకుంది. సొంత పత్రిక ఉండడంతో పేజీలకు పేజీలు రాస్తోంది. దీనివల్ల వైసిపి నాయకులకు కొంతమేర ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సాక్షి పేపర్ కటింగ్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. పిచ్చిపిచ్చిగా ప్రచారం చేసుకోవచ్చు. అంతకుమించి వీసమెత్తు ఉపయోగం కూడా లేదు

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...
Oktelugu Epaper
Exit mobile version