Liquor Scam: మద్యం కుంభకోణంలో( liquor scam) ప్రధానంగా వినిపిస్తున్న పేరు రాజ్ కసిరెడ్డి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయనే కర్త,కర్మ,క్రియ. ఈ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మరంగా వేటాడుతోంది. విచారణ కోసం పిలిచినా ఆయన లెక్క చేయలేదు. నోటీసులు ఇచ్చిన స్పందించలేదు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాలు, సన్నిహితులు, స్నేహితుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్ చేరుకున్న 50 మంది ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. లిక్కర్ కింగ్ పిన్ గా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
Also Read: కెసిఆర్ ను ఫాలో అవుతున్న జగన్
* దర్యాప్తులో నమ్మలేని నిజాలు..
అయితే ఈ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్నారు ఏఎస్పీ భూషణం( ASP bhushanam) . అయితే ఈ దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. రాజ్ కసిరెడ్డి సినిమా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు బినామీ పేర్లతో ఈడి క్రియేషన్స్ అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా కూడా ఉన్నారని గుర్తించారు దర్యాప్తు బృందం అధికారులు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్న తరుణంలోనే మద్యం స్కాం బయటపడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, పవర్ ప్లాంట్స్ లోను వాటాలు పెట్టారని చెబుతున్నారు. కసిరెడ్డి కూతురు ఇషాని పేరుతో ఓ ఇన్ఫ్రా సమస్తను సైతం నెలకొల్పారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వాటాలు పెట్టారని… బ్లాక్ మనీని వైట్ గా మార్చేశారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
* పేరుకే ఐటి సలహాదారు..
వాస్తవానికి రాజ్ కసిరెడ్డి ( Raj kashireddy ) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడు. ఆయనకు మద్యం కుంభకోణంతో సంబంధం ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్న. పేరుకే ఐటి సలహాదారుడు కానీ.. ఆయన ఎక్కువగా మద్యం వ్యాపారాన్ని పర్యవేక్షించాలని ఫిర్యాదులు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా మరోవైసీపీ నేతతో కలిసి ఆయన ఈ దందా నడిపినట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ అమ్మాలనేది రాజ్ కసిరెడ్డి డిసైడ్ చేసేవారని.. తమకు ముడుపులు ఇచ్చిన కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చేవారని.. ఇందుకోసం కేసుకు 150. ఇలా ప్రతినెల కమీషన్ల రూపంలో 60 కోట్ల రూపాయలు వసూలు చేసేవారని పోలీస్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. వైసిపి పాలనలో నాలుగేళ్ల ఎనిమిది నెలల పాటు ఈ దందా కొనసాగిందని.. వేల కోట్ల రూపాయలు అక్రమంగా కూడేసారని రాజ్ కసిరెడ్డి పై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* హైదరాబాదులో జల్లెడ
ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాదులో( Hyderabad) జల్లెడ పడుతోంది. ఆయన అవినీతిపరుడు అంటూ పత్రికల్లో కథనాలు వచ్చిన రాజ్ కసిరెడ్డి ఎంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోనే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి మద్యం స్కాం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని తేల్చేశారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి దందాలు ఒక్కొక్కటి బయటకు వెలుగులోకి వస్తుండడం గమనార్హం.
Also Read: అమరావతి పై ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు.. ఆ నిధులకు అడ్డంకి