Heinrich Klaasen: గత సీజన్ నుంచి హైదరాబాద్ జట్టుకు కాటేరమ్మ కొడుకుల జట్టుగా పేరు వచ్చింది. సలార్ సినిమాలో సెకండ్ హాఫ్ లో కాటేరమ్మ ఫైట్ సీన్లో ప్రభాస్ వీర లెవెల్లో రెచ్చిపోతాడు. విష్ణును చూస్తుండగానే అంత మొందిస్తాడు. థియేటర్లలో ఆసన్నివేశం ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తుంటాయి. సినిమాలో ఆ సీన్ కు ఏ రేంజ్ లో అయితే ఫ్యాన్ బేస్ ఉందో.. హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్న తీరుకు కూడా అదే లెవల్లో ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే హైదరాబాద్ అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు.. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్లను ఊచ కోత కోస్తున్నప్పుడు “కాటేరమ్మ కొడుకులు వచ్చారు.. చితక్కొడుతున్నారు” అనే ఉపమానాన్ని వాడటం సర్వసాధారణంగా పెట్టుకున్నారు.
Also Read: ముంబై, చెన్నై, హైదరాబాద్.. జాతి రత్నాలు.. వీడియో వైరల్
ఇప్పుడు తెలిసిపోయింది
హైదరాబాద్ జట్టులో హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి భయంకరమైన ఆటగాళ్లు ఉన్నారు. వీరు ఆరుగురు దూకుడుకు పర్యాయపదంగా ఆడుతూ ఉంటారు. వేగానికి సరైన కొలమానంగా ఆడుతూ ఉంటారు. ఏ మాత్రం భయపడరు. జట్టు ఎలాంటిదైనా.. బౌలర్ ఎలాంటివాడైనా.. ఎదురుదాడికి దిగడమే పనిగా పెట్టుకుంటారు. బంతిని బలంగా కొడతారు. బ్యాట్లను విరిగే విధంగా బాదుతూ ఉంటారు. అందువల్లే వీరిని కాటేరమ్మ కొడుకులు అంటారు. అయితే ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత.. హైదరాబాద్ ఆటగాళ్లపై ప్రశంసలు పెరిగిపోయాయి. ఇదే క్రమంలో వారిని కాటేరమ్మ కొడుకులు అని పిలవడం ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ ఆటగాళ్లను కాటేరమ్మ కొడుకులు ఎందుకంటరు.. దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని ఆ కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాదు కాటేరమ్మ కొడుకులు అనే పదాన్ని హైదరాబాద్ క్రికెటర్లతో పలికించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో హైదరాబాద్ అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు. ” మొత్తానికి హైదరాబాద్ ఆటగాళ్లకు కాటేరమ్మ కొడుకులంటే ఎవరో తెలిసిపోయింది. ఇన్నాళ్లకు ఆ పదానికి అర్థం వారికి అవగతం అయింది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు ఆటగాళ్లకు కూడా ఇలాంటి గుర్తింపు వచ్చి ఉండదని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. రాజస్థాన్ బౌలర్ల బౌలింగ్ ను చీల్చి చెండాడారు. ఆ తర్వాత మిగతా మ్యాచ్లలో తేలిపోయారు. మళ్లీ శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుపై దూకుడు కొనసాగించారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా ప్లే ఆఫ్ ఆశలను ఇప్పటివరకు అయితే కాస్త సజీవంగానే ఉంచుకుంది.
Finally bro got to know his nickname – Kateramma Koduku pic.twitter.com/Q7MyOXOrb8
— Ram (@SunRAISAAR) April 14, 2025